YSRCP : సీల్డ్ కవర్లు రెడీ.. అందులో ఎమ్మెల్యేల తలరాత.. ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఔట్?
YSRCP : సీల్డ్ కవర్ అంటే ఏంటి.. అందులో ఏమైనా గిఫ్ట్ ఉంటుందేమో అని అనుకుంటున్నారా? గిఫ్ట్ లేదు తొక్కా లేదు.. సీల్డ్ కవర్లలో ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన తలరాత అందులో ఉంది. అంటే.. వైసీపీ ఎమ్మెల్యేలందరిపై నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం జగన్ చాలా సర్వేలు చేయించారు. అందులో ఎవరికి ప్రజాబలం ఉంది.. ఎవరికి ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది అనే అంశాలపై వైఎస్ జగన్ రిపోర్టు రెడీ చేశారు. ఒక్కసారి కాదు.. గత నాలుగేళ్ల నుంచి సీఎం జగన్ ప్రతి నియోజకవర్గంలో సర్వే చేయిస్తున్నారు. ఇప్పుడు ఓవర్ ఆల్ గా ఆ సర్వే రిపోర్ట్ ను రెడీ చేసుకొని ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన పనితీరు రిపోర్ట్ ను సీల్డ్ కవర్లలో పెట్టారు.
నియోజకవర్గాల వారీగా తయారు చేసిన రిపోర్టులకు సంబంధించిన సీల్డ్ కవర్లను ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్వయంగా అందజేస్తారని తెలుస్తోంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రతి ఎమ్మెల్యేకు సీఎం జగనే స్వయంగా వెళ్లి ఆ సీల్డ్ కవర్ ను అందించనున్నట్టు తెలుస్తోంది. నిజానికి.. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ చాలా రోజుల నుంచి వార్నింగ్ లు ఇస్తూనే ఉన్నారు. వర్క్ షాపులు పెట్టి కూడా వాళ్ల పనితీరు మార్చుకోవాలని చెప్పారు. వాళ్ల పనితీరు గురించి అందరి ముందే చెప్పేవారు. కొందరు ఎమ్మెల్యేలతో పర్సనల్ గానూ మాట్లాడేవారు. కొందరు ఎంఎల్ఏలు మాత్రం తమ పనితీరును మెరుగుపరుచుకున్నా.. మరికొందరు మాత్రం అస్సలు తమ పనితీరును మెరుగుపరుచుకోకపోవడమే కాదు.. ఇప్పటి వరకు ఉన్న బలం కూడా లేదట.
YSRCP : క్లాసులు పీకినా మారని ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి?
ఇటీవల వర్క్ షాపు నిర్వహించినప్పుడు 18 మంది ఎమ్మెల్యే పనితీరు సరిగ్గా లేదని సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను పద్ధతి మార్చుకోవాలని హితువు పలికారు. ఇప్పుడు ఇక.. ఏకంగా సీల్డ్ కవర్లే. అందులో ఏం ఉంటే అదే. అంటే.. వాళ్లకు టికెట్ ఇచ్చేది.. ఇవ్వనిది అన్నీ అందులో ఉంటాయి. ఈసారి మాత్రం 30 మంది వరకు ఎమ్మెల్యేలకు టికెట్ దక్కే చాన్స్ లేదని అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.