AP Kutami : వామ్మో కూటమి పై అంతటి వ్యతిరేకత ఉందా..? షాక్ ఇస్తున్న సర్వేలు..!
ప్రధానాంశాలు:
AP Kutami : వామ్మో కూటమి పై అంతటి వ్యతిరేకత ఉందా..? షాక్ ఇస్తున్న సర్వేలు..!
AP Kutami : ఏపీలో కూటమి ప్రభుత్వం పది నెలలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజల మూడ్‌ను అంచనా వేయడానికి పలువురు సర్వే నిపుణులు, సంస్థలు పరిశోధనలు ప్రారంభించగా, అందులో వచ్చిన ఫలితాలు కూటమి నేతలకు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్టు స్పష్టమవుతోంది.

AP Kutami : వామ్మో కూటమి పై అంతటి వ్యతిరేకత ఉందా..? షాక్ ఇస్తున్న సర్వేలు..!
AP Kutami 71 మంది ఎమ్మెల్యేలు ప్రజలు ఛీ కొడుతున్నారా..? సర్వేలు ఇదే చెపుతున్నాయి
175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలను సమీకరించిన ఓ సర్వే ప్రకారం, 71 మంది ఎమ్మెల్యేలపై 70 శాతం ప్రజల్లో వ్యతిరేకత ఉందని తేలింది. ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణాలుగా ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారం, రియల్ ఎస్టేట్, ల్యాండ్ డీల్స్‌తో పాటు మైనింగ్ మాఫియా, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చిన్న వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరనుంచి డబ్బు వసూలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల వల్ల ప్రజలు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలపై నమ్మకం కోల్పోతున్నారన్నది స్పష్టమవుతోంది. క్యాడర్‌తో సంబంధాలు దెబ్బతినడం, వారి అందుబాటులో లేకపోవడం కూడా ఓ ప్రధాన కారణంగా పేర్కొనబడింది.