TTD : టీటీడీ కొత్త ఛైర్మ‌న్‌గా ఆయ‌న పేరు ప‌రిశీల‌న‌.. ఎవ‌రిని ఖ‌రారు చేస్తారా అని ఉత్కంఠ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TTD : టీటీడీ కొత్త ఛైర్మ‌న్‌గా ఆయ‌న పేరు ప‌రిశీల‌న‌.. ఎవ‌రిని ఖ‌రారు చేస్తారా అని ఉత్కంఠ‌

TTD : గ‌త కొద్ది రోజులుగా టీటీడీ తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. ల‌డ్డూ విష‌యంలో తెగ రాజ‌కీయం న‌డుస్తుండ‌గా,మ‌రోవైపు ఇప్పుడు టీటీడీ ఛైర్మన్‌గా ఎవ‌రిని నియ‌మిస్తే బాగుంటుందనే చ‌ర్చ హాట్ టాపిక్ గా మారింది. టిటిడి చైర్మన్ గా సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ పేరు దాదాపు ఖరారైనట్లు నెట్టింట అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఈవో ధర్మారెడ్డిని తొలగించినప్పటికీ చైర్మన్ పదవిని ఎవరికీ ఇవ్వలేదు. ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 September 2024,2:10 pm

ప్రధానాంశాలు:

  •  TTD : టీటీడీ కొత్త ఛైర్మ‌న్‌గా ఆయ‌న పేరు ప‌రిశీల‌న‌..ఎవ‌రిని ఖ‌రారు చేస్తారా అని ఉత్కంఠ‌

TTD : గ‌త కొద్ది రోజులుగా టీటీడీ తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. ల‌డ్డూ విష‌యంలో తెగ రాజ‌కీయం న‌డుస్తుండ‌గా,మ‌రోవైపు ఇప్పుడు టీటీడీ ఛైర్మన్‌గా ఎవ‌రిని నియ‌మిస్తే బాగుంటుందనే చ‌ర్చ హాట్ టాపిక్ గా మారింది. టిటిడి చైర్మన్ గా సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ పేరు దాదాపు ఖరారైనట్లు నెట్టింట అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఈవో ధర్మారెడ్డిని తొలగించినప్పటికీ చైర్మన్ పదవిని ఎవరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూలో పందికొవ్వు ఉందని ల్యాబ్ రిపోర్ట్ రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే తిరుపతి లడ్డూ పరీక్షలు జరిగాయి.

TTD  అంతా స‌స్పెన్స్..

నాణ్యత లోపాలు ఉన్నాయని ఫిర్యాదులు అందడంతో కూటమి ప్రభుత్వం ఈ పరీక్షలు చేపట్టింది. ల్యాబ్ రిపోర్టు ఆలస్యంగా వచ్చాయి. లడ్డూలో పందికొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. గత ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టర్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో వైసీపీ ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో చైర్మన్లుగా పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి దోషులుగా నిలబడాల్సి వచ్చింది. కీలకమైన టిటిడి చైర్మన్ పదవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ తెరదించారు. ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్, సినీ నిర్మాత అశ్వినీదత్ పేర్లు వినిపించాయి.ఒక మీడియా అధిపతి పేరు కూడా ప్రచారం లోకి వచ్చింది.

TTD టీటీడీ కొత్త ఛైర్మ‌న్‌గా ఆయ‌న పేరు ప‌రిశీల‌న‌ ఎవ‌రిని ఖ‌రారు చేస్తారా అని ఉత్కంఠ‌

TTD : టీటీడీ కొత్త ఛైర్మ‌న్‌గా ఆయ‌న పేరు ప‌రిశీల‌న‌.. ఎవ‌రిని ఖ‌రారు చేస్తారా అని ఉత్కంఠ‌

క‌ట్ చేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్న ఎన్ వి రమణ ధర్మ పరిరక్షణ కోసం అనేక చారిత్రాత్మక తీర్పులను వెలువరించారు. రెండేళ్ల క్రితం ఆయన పదవీ విరమణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని మాత్రం రాజకీయ ప్రమేయం లేని వారికి సమాజంలో ఉన్నత స్థాయి గౌరవాలు కలిగిన వారికే ఇస్తారు అన్నది ప్రచారంగా ఉంది. త్వ‌ర‌లోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంద‌ని అంటున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది