Amaravathi : మళ్ళీ వార్తల్లోకి వచ్చిన అమరావతి – సుప్రీంలో ఊహించని సన్నివేశం..!
Amaravathi : ఇంకా సంవత్సరం కూడా లేదు. ఏపీలో ఎన్నికలు టైమ్ దగ్గరపడింది. అందుకే ఎన్నికల కసరత్తును పార్టీలన్నీ ప్రారంభించాయి. పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో వ్యూహాలను రచించడంలో బిజీ అయిపోయాయి. అయితే.. అధికార పార్టీ వైసీపీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి రెండోసారి ఏపీలో అధికారంలోకి రావాలని తెగ ఉబలాటపడుతోంది. అందుకే.. ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందో.. అంతకంటే ఎక్కువ హామీలనే అమలు చేసింది. మూడు రాజధానులను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కానీ.. అది కాస్త సుప్రీంకోర్టులో కేసు అయి కూర్చొంది.
వైసీపీకి ఇప్పుడు ఏదైనా అసంతృప్తి ఉంది అంటే.. అది మూడు రాజధానుల సమస్య. ఎందుకంటే.. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు సూపర్ హిట్టు అయ్యాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఆ పథకాలను పొగిడాయి. కానీ.. మూడు రాజధానుల అంశం మాత్రం ఎటూ తేలకుండా పోయింది. సుప్రీంలో ఆ కేసు పెండింగ్ లో ఉంది. ఆ కేసు విచారణ ఇప్పుడు ఈ నెల 11న జరగనుంది. అయితే.. సుప్రీంకోర్టులో విచారణ తరువాత అంటే 12న ఏపీ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. దీంతో ఏపీలో ఉత్కంఠ నెలకొన్నది. సుప్రీంలో మూడు రాజధానులపై ఎలాంటి తీర్పు వస్తుందో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.నిజానికి ఏపీ హైకోర్టులోనే మూడు రాజధానుల అంశం విచారణకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మూడు రాజధానుల అంశం తెరమీదికి రావడంతో అమరావతి రాజధాని మద్దతుదారులంతా మూడు రాజధానులకు వ్యతిరేకంగా కదం తొక్కారు. హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. దీంతో హైకోర్టు కూడా అమరావతిలోనే హైకోర్టు ఉండాలని తీర్పు చెప్పింది.
Amaravathi : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్
దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తీర్పును రద్దు చేయాలంటూ కోరింది. దీనికి సంబంధించిన విచారణ ఈనెల 11న జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసును మే 17న వేరే ధర్మాసనం విచారించింది. కానీ.. విచారణ పూర్తిగా ముగియలేదు. దీంతో విచారణను జులై 11కు వాయిదా వేశారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మూడు రాజధానుల అంశం కూడా ఒక కొలిక్కి వస్తే వైసీపీ ప్రభుత్వానికి ఇక ఎలాంటి టెన్షన్ ఉండదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలను ధైర్యంగా ఓట్లు అడగే చాన్స్ ఉంటుంది. అందుకే.. వైసీపీ ప్రభుత్వానికి ఈ విచారణ ఒక చాలెంజింగ్ గా మారింది.