AP Home Minister : హోం మంత్రి, మాజీ హోం మంత్రిల మధ్య డిష్యూం డిష్యూం.. ఆడాళ్ల పంచాయతీ ఇలానే ఉంటది మరి..!
ప్రధానాంశాలు:
AP Home Minister : హోం మంత్రి, మాజీ హోం మంత్రిల మధ్య డిష్యూం డిష్యూం.. ఆడాళ్ల పంచాయతీ ఇలానే ఉంటది మరి..!
AP Home Minister : ఏపీలో జగన్ వైఖరి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన రావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్తే తానూ కూడా అక్కడికే వెళ్లి తేల్చుకుంటానని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. . వైఎస్ వివేకానంద హత్యతో పాటు వైసీపీ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తమ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో చర్చించేందుకు తానే వస్తానని సవాలు విసిరారు అనిత.
AP Home Minister తేల్చుకుందాం..
అసెంబ్లీకి వస్తే జగన్ చేసిన పనులు బయటపడతాయని అనిత విమర్శించారు. అసెంబ్లీలో ఈ నెల 24న శాంతి భద్రతలపై శ్వేతపత్రం పెట్టి ప్రభుత్వం చర్చ చేపట్టనుందని తెలిపారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని అన్నారు. ఢిల్లీకి వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా వెళ్లొచ్చని చెప్పారు. జగన్ చేస్తున్న శవ రాజకీయాలకు ఆయనకు సిగ్గనిపించకపోయినా ఏపీ ప్రజలు ఆయన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారని అనిత అన్నారు. జగన్ చెప్పినట్లు నెల రోజుల వ్యవధిలో 36 రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయటపెట్టాలని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన ముగ్గురు తెలుగుదేశం వారేనని తెలిపారు.
ఇక ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ హోంమంత్రి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో వనిత మాట్లాడుతూ.. అనిత చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దాడులు జరుగుతుంటే హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అనిత కూడా ఎమ్మేల్యేగా గెలిచే మంత్రి అయ్యారని చెప్పారు. చంద్రబాబు కూడా కుప్పానికి ఎమ్మేల్యేనే అని అన్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని, వాళ్ల పనిని వాళ్లు చేసుకోనివ్వాలని చెప్పారు. టీడీపీ నేతలు దాడులు చేసి, తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.