JanaSena – TDP : జనసేనకు 28 సీట్లేనా..? అన్యాయం చేస్తున్న టీడీపీ.. !
JanaSena – TDP : తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు సమాచారం. తాజాగా ఉండవల్లి లోని చంద్రబాబు నాయుడు నివాసంలో మూడు గంటల పాటు సమావేశమైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో ఒక అవగాహన వచ్చినట్లు భోగట్టా. ఈ నెల 10 తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిసిన తర్వాత సీట్ల పంపకం గురించి రెండు పార్టీలు ప్రకటన చేసే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కనీసం జనసేన నుంచి 60 సీట్లు కోరుతున్నారని ప్రచారం తనపైకి వచ్చింది. ఆ తర్వాత 40 సీట్లకు ఒప్పందం కుదిరిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా ఏపీలో జనసేనకు 28 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారని తాజాగా పుకార్లు వచ్చాయి. రెండు పార్టీలకు చెందిన సీనియర్లు ఈ ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కనీసం 35 అసెంబ్లీ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని చంద్రబాబు నాయుడుని కోరినట్లు తెలుస్తుంది. అయితే 35 సీట్లు ఇవ్వడం కష్టం అవుతుందని చంద్రబాబు 28 సీట్లు ఇస్తామని, అధికారంలోకి వచ్చాక జనసేనకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్లు సమాచారం. దాంతోపాటు 25 లోక్ సభ స్థానాలు ఉన్నా ఏపీలో జనసేనకు మూడు స్థానాలు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారట. లోక్ సభ స్థానాలకు పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టు పట్టకపోయినా అసెంబ్లీ స్థానాలకు 35 సీట్లు ఇస్తే బావుంటుందని పవన్ కళ్యాణ్ అంటున్నారట.
ఇప్పటివరకు సీట్ల విషయంలో ప్రకటన ఇవ్వకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నారు. టీడీపీ తో పొత్తు వద్దని బీజేపీ అగ్ర నేతలు చెబుతున్న చంద్రబాబు నాయుడు తన ప్రయత్నాలు ఆపడం లేదు. ఈనెల 10 తర్వాత పవన్ కళ్యాణ్ చివరిసారి బీజేపీ అగ్రనేతల వద్దకు చంద్రబాబునాయుడు పంపుతున్నారు. అప్పుడు బీజేపీ నేతలు పొత్తు విషయంలో ఏ ప్రకటన ఇస్తారో చూసి ఆ తర్వాతనే సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని వెల్లడించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ పొత్తుకు సై అంటే బీజేపీకి కూడా కొన్ని స్థానాలు కేటాయించాల్సి వస్తుంది. బీజేపీ తో పొత్తు లేకపోతే కమ్యూనిస్టులను చేర్చుకుంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నాయని అంటున్నారు. సీట్ల సర్దుబాటు వ్యవహారం తేలాక టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.