Chandrababu : ఒకటే పథకం.. ఏడు ప్రయోజనాలు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయడు సరికొత్త ఆలోచన
ప్రధానాంశాలు:
Chandrababu : ఒకటే పథకం.. ఏడు ప్రయోజనాలు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయడు సరికొత్త ఆలోచన
Chandrababu : చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇటీవలే ఆయన తొలిసారిగా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో తాము అవలంబించబోయే విధానాలు, సంక్షేమం కోసం అమలు చేయాలనుకుంటున్న పథకాలను చంద్రబాబు వివరించారు. వాటిని ప్రజలకు చేరువయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని, ఈ విషయంలో అలసత్వానికి తావులేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాను ప్రవేశ పెట్టబోయే ఒకటే పథకం ద్వారా ప్రజలకు ఎన్నిరకాలుగా ప్రయోజనాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం.సెప్టెంబరు 1 నుంచి పేదల సేవలో పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు.
ప్రతి నెలా 1వ తేదీన ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుంటారు. సాధ్యమైనంత వరకు కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. స్కిల్ డెవలప్ మెంట్ అంశాన్ని కలెక్టర్ల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించి యువతకు ఉద్యోగాలు ఇచ్చేదిశగా అడుగులు వేయబోతున్నారు. 2047 నాటికి దేశంలో పెరుగుతున్న వృద్ధ జనాభాను దృష్టిలో ఉంచుకుని వారికి అనుగుణంగా కొత్త పథకాలను, వారి అవసరాలను తీర్చేలా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
ప్రతి జిల్లాల్లో విండ్ టర్బైన్లు ఏర్పాటు చేయనున్నారు. సోలార్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని సోలార్ విద్యుత్తు దిశగా ప్రోత్సహించనున్నారు. ప్రతి ఇంటిపై సోలాన్ ప్యానెళ్లు ఏర్పాటు చేయించి, వారి గృహ అవసరాలు తీరగా మిగిలిన విద్యుత్తును కొనుగోలు చేయనున్నారు. గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు కలిపి ఓ యాప్ అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారు. చెత్తను పొలాలకు ఎరువుగా ఉపయోగించే అంశంతో పాటు దాన్ని రీసైక్లింగ్ చేసి డబ్బులు సంపాదించేలా చూడనున్నారు. అధికారులు క్రియేటివ్ గా ఆలోచించి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని చంద్రబాబు నాయుడు కోరారు.