Ys Jagan : జగన్ ఆ పని చేస్తే టీడీపీని శాశ్వతంగా మూసేస్తారట
Ys Jagan : ఏపీలో తిరుపతి ఉప ఎన్నికల వేడి అంతా ఇంతా అన్నట్లుగా లేదు. సవాళ్లు ప్రతి సవాళ్లు ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నట్లుగా దుమ్ము రేపుతున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరాటం లో టీడీపీ మరియు వైకాపా నాయకులు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు చేయడం కామన్‌గా మారిపోయింది. ఇటీవలే మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికలను తాము రెఫరెండంగా భావిస్తున్నాం. ఒక వేళ మేము ఓడిపోతే మా ఎంపీలు అంతా కూడా రాజీనామా చేస్తారు. మరి మీరు ఓడిపోతే మీ ఎంపీలతో పాటు మీకు అనుకూలంగా వ్యవహరిస్తున్న రఘురామ కృష్ణంరాజు కూడా రాజీనామా చేయాలంటూ సవాళ్లు విసిరాడు. ఆ సవాళ్లకు టీడీపీ నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు.
ys jagan : అసెంబ్లీ రద్దు డిమాండ్..
ఏపీ అసెంబ్లీని రద్దు చేసి రెఫరెండంగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని, అప్పుడు మళ్లీ వైకాపా గెలిస్తే అప్పుడు తెలుగు దేశం పార్టీ ని శాశ్వతంగా మూసేస్తాం అంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు అచ్చంనాయుడు సవాల్ విసిరాడు. అధికారంలో ఉండి ఎంపీగా గెలుస్తాం అదే రెఫరెండం అంటూ చెప్పుకోవడం వారి అవివేకం అన్నట్లుగా అచ్చెన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. దమ్ముంటే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలంటూ సూచించాడు.
ys jagan : లోకేష్ ఛాలెంజ్..
తమ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేసిన సవాల్ కు వెనక్కు తగ్గిన జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకున్నాడు. గత ఎన్నికల సమయంలో జరిగిన వివేకా హత్య కేసుతో జగన్ కు సంబంధం ఉందని వాదన వినిపిస్తుంది. అయినా కూడా ఆ కేసును ఎటూ తేల్చకుండా నాన్చుతూ వస్తున్నాడు. దమ్ముంటే ఆ కేసును వెంటనే పరిష్కరించాలని కూడా వైఎస్ జగన్‌కు అచ్చెన్న సవాల్ విసిరాడు. మరి అచ్చెన్న సవాల్ కు వైకాపా నాయకులు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది చూడాలి.