BJP Jana Sena : జనసేనతో బిజెపి పొత్తు వెనక ఆ ప్రముఖ వ్యక్తి హస్తం… ఆయన ఎవరంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BJP Jana Sena : జనసేనతో బిజెపి పొత్తు వెనక ఆ ప్రముఖ వ్యక్తి హస్తం… ఆయన ఎవరంటే…!

 Authored By aruna | The Telugu News | Updated on :8 February 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  BJP Jana Sena : జనసేనతో బిజెపి పొత్తు వెనక ఆ ప్రముఖ వ్యక్తి హస్తం...ఆయన ఎవరంటే...!

BJP Jana Sena : 2018 19 ప్రాంతంలో ఎలక్షన్స్ కి ముందు నరేంద్ర మోడీ అలాగే చంద్రబాబు నాయుడు వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని గొడవల వలన ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకోకూడదు అని చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులు ఎంతగా రిక్వెస్ట్ చేసినప్పటికీ వర్కౌట్ అవడం లేదు. అయితే చివరి నిమిషంలో అసలు ఏం జరిగింది. రెండు పార్టీల మధ్య పొత్తు ఎలా కుదిరింది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక విషయానికొస్తే 2019కి ముందు జరిగినటువంటి కొన్ని విషయాలలో ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ ధర్మ పోరాట దీక్ష ఇలా అనేక రకాల డ్రామాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయంతో పోల్చి చూస్తే అప్పట్లో అనేక రకాల డ్రామాలు జరిగేవి. ఒక పక్క బీజేపీ ఒక రకమైన డ్రామా వేస్తే మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా పైన డ్రామా, అలాగే చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ అని కబుర్లు చెప్పి ఆ తర్వాత బిజెపిని ఎదిరిస్తున్నామని ఆయన ఒక డ్రామా ఇలా అనేక రకాల డ్రామాలు జరిగేవి. అయితే రాజకీయ నాయకులు ఎప్పుడూ డ్రామాలు ఆడుతూనే ఉంటారని చెప్పాలి. కానీ అప్పట్లో వీరంతా చాలా డిఫరెంట్ గా డ్రామాలు చేస్తూ ఉండేవారు. అలాగే మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుపై పోరాటం చేసేస్తున్నట్లు ఈ విధంగా రకరకాల డ్రామాలు నడిచాయి.

అయితే ఇలాంటివి చేసే సమయంలో కొన్ని మాటలు జారారు చంద్రబాబు. అయితే ఆయన లెక్క ఏంటంటే.. ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చే సమస్య లేదని. అంటే 2019 ఆ టైంలో ఎన్డీఏ మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చే సమస్య లేదని ఈసారి యూపీఏ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అనేటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ చంద్రబాబుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మోడీ ఇకపై వచ్చే సమస్య లేదు అని అనుకున్న చంద్రబాబు మోడీ పైన యుద్ధం లేక ప్రత్యేక హోదా రావడానికి నేనే పోరాటం చేస్తున్నట్లుగా చూపించుకోవడానికి ధర్మ పోరాట దీక్ష పేరుతో నానా హడావిడి చేశారు. ఇక ఈ దీక్ష చేస్తున్న సమయంలో ఆయన చాలా తప్పుగా మాట్లాడారు. మోడీని ఉద్దేశించి మీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారా అని వ్యాఖ్యలు చేయడం, ఎన్డీఏ ఈసారి కచ్చితంగా ఓడిపోతుందని చెప్పడం ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందంటూ వ్యాఖ్యలు చేయడం వంటి వ్యాఖ్యలు చంద్రబాబు చేశారు. ఇవి చాలవు అన్నట్టు కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు చేసిన పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బిజెపిని బాగా ఇబ్బంది పెట్టాయని చెప్పాలి. అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డిని మోడీకి దగ్గర అయ్యేలా చేశాయి. జగన్ ఎప్పుడైతే సీఎంగా అధికారంలోకి వచ్చారో ముందుగా మోడీ వద్దకు వెళ్లి ఆయనతో మంచి బంధాన్ని ఏర్పరచుకున్నారు.

అయితే మోడీని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడిన చంద్రబాబుతో పొత్తుకు ఇప్పుడు బిజెపి ఒప్పుకుంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు విశ్వ ప్రయత్నాలు చేసినా అసలు బిజెపితో మైత్రి బంధం, బిజెపితో పోత్తులోకి వెళ్లడం ఎన్డీఏలోకి పవన్ కళ్యాణ్ ఎంటర్ అవ్వడమే ఈరోజు చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పెట్టుకోవడంలో భాగంగా ముందే ఫిక్స్ అయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా వెళ్లారని పలువురు అంటున్నారు. అయినా కానీ మోడీ ఒప్పుకోకపోవడం తో ఆఖరి నిమిషంలో మీకు కావాల్సింది ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీతో మాట్లాడి నేను ఇప్పిస్తానని ఏపీ తో పొత్తు పెట్టుకోండి అని ఒక ప్రముఖ వ్యక్తి వెళ్లి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ ప్రముఖ వ్యక్తి విషయానికొస్తే ఈ మధ్యనే అతనికి పెద్ద అవార్డు కూడా లభించింది. చాలా పెద్ద పేరు ఉన్న వ్యక్తి. ఆయన వలనే బిజెపి పార్టీతో పొత్తు సాధ్యమైందని పలువురు తెలియజేస్తున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది