YSRCP: దర్శిలో అమ్మాయిలతో వైసీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్సులు వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: August 3, 2023, 3:29 pm

YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అధికార పార్టీ వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇంకా ప్రాజెక్టుల పరిస్థితి గురించి ఆలోచించకుండా పనికిరాని సినిమాలపై పోరాటాలు చేస్తున్నారని చాలామంది విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు చాలా అద్వానంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు వల్ల చాలామంది ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా సరే ఇటువంటి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వైసీపీ నాయకుల అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్లు మండిపడుతూ ఉన్నారు…

the-video-of-ycp-leaders-recording-dances-with-girls-in-darshi-has-gone-viral

the-video-of-ycp-leaders-recording-dances-with-girls-in-darshi-has-gone-viral

 

ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అధికారాన్ని పనికిరాని వాటికి దుర్వినియోగం చేస్తున్నట్లు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మరి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా దర్శిలో అమ్మాయిలతో వైసీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల జన్మదినం సందర్భంగా బుధవారం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్స్ కచేరీలో..వైసీపీ నాయకులు అమ్మాయిలతో కలిసి బాహుబలి లోని మనోహర వంటి పాటలకు డ్యాన్సులు వేయడం జరిగింది. ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక అధికార పార్టీకి చెందిన నేతలు బాధ్యతగా మెలగాల్సింది పోయి ఈ రకంగా వ్యవహరించటం దారుణమని విమర్శలు చేస్తున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp