YCP : దారుణ‌మైన ప‌రిస్థితిలో జ‌గ‌న్.. వైసీపీకి దిక్కెవ‌రు ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YCP : దారుణ‌మైన ప‌రిస్థితిలో జ‌గ‌న్.. వైసీపీకి దిక్కెవ‌రు ?

 Authored By ramu | The Telugu News | Updated on :29 September 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  YCP : దారుణ‌మైన ప‌రిస్థితిలో జ‌గ‌న్.. వైసీపీకి దిక్కెవ‌రు ?

YCP  : ఐదు సంవ‌త్స‌రాల పాటు ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న జ‌గ‌న్ త‌న హ‌వా చూపిస్తూ దూసుకుపోయాడు. ఇప్పుడు జగన్‌కు కష్టాలు రెట్టింపు అయ్యాయా? అన్నీ ఒక్కసారే వచ్చిపడ్డాయా? వాటిని ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతున్నారా? అని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు పార్టీ నుంచి నమ్ముకున్న నేతలు బయటకు వెళ్లిపోవడం, మరోవైపు ఫ్యామిలీ కష్టాలు, లడ్డూ విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం జ‌గ‌న్‌ని టార్గెట్ చేయ‌డం జ‌గ‌న్‌కి మింగుడుప‌డ‌డం లేదు. వ‌చ్చే ఐదేళ్లు కూడా.. పార్టీకి, పార్టీ అధినేత జ‌గ‌న్‌కు కూడా ఆటు పోట్లు త‌ప్పేలా లేవ‌ని తెలుస్తోంది.

YCP  జ‌గ‌న్‌కి గ‌డ్డు క‌ష్టాలు..

త‌న‌పై న‌మోదైన అక్ర‌మ కేసుల నుంచి జ‌గ‌న్ త‌ప్పించుకునే ప‌రిస్థితి లేదు. మామూలుగా ఓటు బ్యాంకు రాజకీయాలపై లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం జగన్ కు, ఆయన పార్టీకీ తీరని నష్టం చేసిందని అంతా భావిస్తున్నారు కానీ, లడ్డూ ప్రసాదంలో కల్తీ ఎఫెక్ట్ అంత కంటే లోతుగానే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ మీడియా ముందుకు వచ్చి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో చేసిన రాజకీయ విమర్శలు పూర్తిగా నిరుపయోగం అవ్వడమే కాకుండా.. కచ్చితంగా జగన్ హయాంలోనే ఈ కల్తీ జరిగిందన్నది ప్రజలకు నిర్ధారణ చేశాయి. ఇది వైసీపీకి రాజకీయంగా తీరని నష్టం కలిగించిందనడంలో సందేహం లేదు. కేవలం నష్టమే కాకుండా ఆ పార్టీకి రాజకీయ ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేసే రేంజ్ లో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ప్రజలలో ఆగ్రహావేశాలను నింపింది.

YCP దారుణ‌మైన ప‌రిస్థితిలో జ‌గ‌న్ వైసీపీకి దిక్కెవ‌రు

YCP : దారుణ‌మైన ప‌రిస్థితిలో జ‌గ‌న్.. వైసీపీకి దిక్కెవ‌రు ?

అయితే సాక్ష్యాలు చూపాల‌ని జ‌గ‌న్ అంటుండ‌గా, కూట‌మి ప్ర‌భుత్వం ల్యాబ్ ప‌త్రాలు చూపిస్తూ ఇంకేం ఆధారాలు కావాల‌ని అంటుంది. మ‌రోవైపు అత్యున్న‌త సిట్ బృందాన్ని కూడా నియ‌మించింది. ఇప్ప‌టికే ఆ బృందం విచార‌ణ కూడా జ‌రిపిస్తుంది. అయిన జ‌గ‌న్ మాత్రం ప‌లువురికి లేఖ‌లు రాసుకుంటూ పోతున్నాడు.లడ్డూ వివాదం తరువాత వైసీపీ పార్టీకి బీజేపీ అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌. తన రాజకీయ ప్రయోజనాల కోసమైనా.. జగన్ కు మద్దతు, సహకారం అందించే పరిస్థితి ఇప్పుడే కాదు మరెప్పుడూ తలెత్తే అవకాశం లేదు. హిందూత్వను భుజాన వేసుకునే బీజేపీ ఇప్పుడు అనివార్యంగా మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువగా జగన్ పై విమర్శలు గుప్పించి, జగన్ తిరుమల తిరుపతికి చేసిన అపచారాన్ని ఎండగట్టక తప్పని పరిస్థితి లడ్డూ వివాదం కారణంగా ఏర్పడింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది