YS Jagan : దేశంలో ఎవ్వరూ పెట్టని టార్గెట్ జగన్ పెట్టడానికి కారణం ఏంటి ? ఏం చూసి అంత ధైర్యం ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : దేశంలో ఎవ్వరూ పెట్టని టార్గెట్ జగన్ పెట్టడానికి కారణం ఏంటి ? ఏం చూసి అంత ధైర్యం ?

 Authored By kranthi | The Telugu News | Updated on :5 July 2023,2:00 pm

YS Jagan : ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అని అడిగితే టక్కున వైసీపీ గెలుస్తుంది అని చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారో తెలుసా.. ఎవరో సాదాసీదా వ్యక్తులు చెబితే మనం కూడా నమ్మేవాళ్లం కాదు కానీ.. అక్కడ చెప్పేది సర్వే సంస్థలు. అది కూడా పేరు మోసిన సర్వే సంస్థ వైసీపీకి మళ్లీ పట్టం అని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వైసీపీ విజయదుందుబి మోగిస్తుందని చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో సంబురాలు మొదలయ్యాయి.

టైమ్స్ నౌ అనే జాతీయ మీడియా సంస్థ.. నవభారత్ పేరుతో ఒక సర్వేను నిర్వహించింది. ఆ సర్వేలోనే వైసీపీకి విజయం తథ్యం అని తేలిపోవడంతో వైసీపీ అధిష్ఠానం కూడా ఏదో మామూలుగా, సాదాసీదాగా గెలవడం కాదు. దుమ్ములేపాలి.. దున్నేయాలని.. అంటోంది. అంటే ఏపీలో ఉన్న 175 స్థానాలకు 175 స్థానాలు గెలవాలి. అదే వైసీపీ ప్రస్తుత లక్ష్యం. జీఎం జగన్ కూడా అదే చెబుతున్నారు. మరోసారి 175 స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటితే మరో 30 ఏళ్ల వరకు ఏపీలో తమదే రాజ్యం అని.. తమదే అని చెబుతున్నారు.అసలు ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే నిజంగానే వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందా? అనే దానిపై క్లారిటీ లేనప్పటికీ.. విపక్ష పార్టీలు మూడు కలిసి పోటీ చేస్తే మాత్రం వైసీపీకి అవి గట్టి పోటీ ఇస్తాయనే చెప్పుకోవాలి.

all opposition parties in ap targeted ys jagan

all opposition parties in ap targeted ys jagan

YS Jagan : వైసీపీ నిజంగానే క్లీన్ స్వీప్ చేస్తుందా?

175 స్థానాల్లో కాకపోతే వైసీపీ 100 స్థానాల్లో సరిపెట్టుకునే చాన్స్ ఉన్నా కూడా వైసీపీ గెలిచినట్టే. మ్యాజిక్ ఫిగర్ 90 లోపే కాబట్టి వైసీపీకి ఎక్కువ సీట్లు రాకపోయినా నెట్టుకొస్తుంది. కానీ.. మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా రాకుండా వైసీపీని చేయాలని ప్రతిపక్షాలు పక్కాగా వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ.. ఏదో మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా సీట్లు గెలవడం కాదు.. ఖచ్చితంగా 175 స్థానాలు గెలవాల్సిందే అంటూ సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. చూద్దాం మరి సర్వే ప్రకారమే వైసీపీ మరోసారి గెలిచి తన సత్తా చాటుతుందో వేచి చూడాల్సిందే.

Tags :

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది