Times Now Survey : టైమ్స్ నౌ సర్వే నిజమేనా ? జగన్ ని ఆపడం impossible ?
Times Now Survey : ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్, మేలో ఉంటాయి ఎన్నికలు. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులోనే కొన్ని సంస్థలు కూడా సర్వేలు చేసి ఏ పార్టీ గెలుస్తుందో చెబుతున్నాయి. ఎన్ని సర్వేలు ఏం చెప్పినా కూడా ఏ పార్టీ గెలుస్తుంది అనేది క్లారిటీగా ఇప్పుడే చెప్పలేం. ఎన్నికల వరకు ఏం జరిగినా ఊహించలేం. కానీ.. చాలామటుకు సర్వేలన్నీ సీఎం జగన్ వైపే, వైసీపీ పార్టీ వైపే ఉన్నాయి.
రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ కు ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నారని చాలా సర్వే సంస్థలు చెబుతున్నాయి. వైసీపీ వచ్చే ఎన్నికల్లో మామూలు విజయం కాదు.. క్లీన్ స్వీప్ చేస్తుందని అంటున్నారు. దీంతో నిజంగానే ఏపీలో వైసీపీకి అంత ఆదరణ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఏదో చిన్నాచితకా సర్వే సంస్థల సర్వేలను ఎవ్వరూ నమ్మరు కానీ.. ప్రముఖ మీడియా సంస్థ అయిన టైమ్స్ నౌ తాజాగా ఓ సర్వేను నిర్వహించింది. జన్ గన్ కామన్ పేరుతో ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై సర్వే నిర్వహించింది. దేశ వ్యాప్తంగా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దానిపై కూడా ఈ సంస్థ సర్వే నిర్వహించింది.
Times Now Survey : ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగినా దేశంలో గెలిచేది మళ్లీ ఎన్డీఏనట
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ గెలిచేది ఎన్డీఏ పార్టీనే అంటూ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ అంటే బీజేపీ కూటమే కాబట్టి మళ్లీ ప్రధాని మోదీనే. ఎన్డీఏకు కనీసం 300 నుంచి 325 వరకు సీట్లు వస్తాయట. కాంగ్రెస్ కు 150 లోపే వస్తాయట. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి 20 నుంచి 22 స్థానాలు వస్తాయట. ఇక ఏపీ విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో ఉన్న 25 స్థానాల్లో 24 నుంచి 25 స్థానాల వరకు వైసీపీ గెలుస్తుందట. అంతే కాదు.. దేశంలోనే ఎక్కువ లోక్ సభ సీట్లు గెలిచే పార్టీల్లో మూడో పార్టీగా వైసీపీ అవతరించనుందని సర్వే సంస్థ వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల్లోనే ఇంత సత్తా చాటితే ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నట్టే కదా.