బిగ్ బ్రేకింగ్ : తిరుపతి ఉప పోరు.. వైకాపా అభ్యర్థి ఖ‌రారు.. ఈయన బ్యాక్ గ్రౌండ్‌ చాలా ఇంట్రెస్టింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

బిగ్ బ్రేకింగ్ : తిరుపతి ఉప పోరు.. వైకాపా అభ్యర్థి ఖ‌రారు.. ఈయన బ్యాక్ గ్రౌండ్‌ చాలా ఇంట్రెస్టింగ్

 Authored By himanshi | The Telugu News | Updated on :16 March 2021,8:23 pm

Tirupati By Elections : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తిరుపతి పార్లమెంట్‌ మరియు నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌ మృతి చెందడటంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. వైకాపా సీటు అవ్వడంతో ఈజీగా అధికార పార్టీ ఆ స్థానంను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు జనసేన సాయంతో బీజేపీ ఆ స్థానంను కైవసం చేసుకునేందుకు సిద్దం అవుతుంది. మరో వైపు తెలుగు దేశం పార్టీ కూడా తిరుపతి ఎంపీ స్థానంను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. వైకాపా సిట్టింగ్‌ స్థానం అయినా కూడా గెలవడం అంత సులభం కాదు అనేది కొందరి వాదన. ఇలాంటి సీఎం వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి తిరుపతి ఉప ఎన్నికకు డాక్టర్ గురుమూర్తిని ఎంపిక చేస్తున్నట్లుగా ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా గురుమూర్తి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గురుమూర్తి తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో ప్రచారం కూడా మొదలు పెట్టాడు. ఇలాంటి సమయంలో నోటిఫికేషన్ రావడం.. పార్టీ కూడా ఆయన్ను అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాంతో ఇప్పుడు అంతా కూడా ఇంతకు ఈ గురుమూర్తి ఎవరు ఎందుకు ఈయనకు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అంటూ అంతా చర్చించుకుంటున్నారు. తిరుపతి ఉప పోరులో గురుమూర్తి నిలవడానికి ప్రధాన కారణం ఆయన వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు. వైకాపా పెట్టినప్పటి నుండి కూడా వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వెంట గురు మూర్తి తిరుగుతూ ఆయనకు మద్దతుగా నిలిచి ఒక కార్యకర్త మాదిరిగా పని చేశాడు.

tirupati by elections ysrcp candidate doctor gurumurthy

tirupati by elections ysrcp candidate doctor gurumurthy

gurumurthy : గురుమూర్తి ఎవ‌రు

పార్టీ కోసమే కాకుండా గురుమూర్తి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌ గా కూడా చూశాడు. వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి జైలులో ఉన్న సమయంలో షర్మిల పాద యాత్ర చేయడం జరిగింది. ఆ సమయంలో ఆమెను వెన్నంటి ఉండి ఆమె ఆరోగ్యం పై శ్రద్ద చూపించాడు. ఆ తర్వాత వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సమయంలో కూడా కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఈ కారణాల వల్లే గురుమూర్తికి ఇప్పుడు తిరుపతి పార్లమెంటు స్థానంను జగన్‌ మోహన్ రెడ్డి ఇచ్చాడు అంటూ వైకాపా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గురుమూర్తి విజయం నల్లేరు మీద నడక అంటూ వైకాపా నాయకులు అంటున్నారు. మూడు లక్షల పైచిలుకు మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు. వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిని నమ్ముకున్నందుకు గురుమూర్తికి మంచి ఛాన్స్ దక్కిందని ఆ పార్టీ లో టాక్ వినిపిస్తుంది. వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు మరియు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ఎంపీగా గురుమూర్తి విజయం అనేది ఇప్పటికే తేలిపోయిందని వైకాపా నాయకులు అంటున్నారు.

ఉప ఎన్నికకు ఈనెల 23వ తారీకున నోటిఫికేషన్‌ రాబోతుంది
ఈనెల 30వ తారీకు వరకు నామినేషన్ల స్వీకరణ
31వ తారీకున పరిశీలన
ఏప్రిల్‌ 3వ తారీకు వరకు నామినేషన్ల ఉపసంహరణ
ఏప్రిల్ 17వ తారీకున పోలింగ్‌
మే 2వ తారీకున కౌంటింగ్.
దేశ వ్యాప్తంగా రెండు పార్లమెంట్ మరియు 14 అసెంబ్లీ స్థానాలకు ఇదే షెడ్యూల్‌ వర్తించనుంది.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది