Undavalli Arun kumar : ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ .. సీఎం ఎవరో క్లారిటీ ఇచ్చేసారు..?
ప్రధానాంశాలు:
Undavalli Arun kumar : ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ .. సీఎం ఎవరో క్లారిటీ ఇచ్చేసారు..?
Undavalli Arun kumar : ఏపీ రాజకీయాలపై మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తీరుపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు నాయుడు భయపడ్డారని, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా భయపడ్డారని అన్నారు.ఎందుకంటే కేసులు భయంతోనే వాళ్ళు వెనుకంజ వేశారని విమర్శించారు. రాక్షసుని, దుర్మార్గున్ని అయిన భరించవచ్చు కానీ పిరికివాడిని భరించే పరిస్థితి ఉండకూడదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఎన్నికల సమయంలో నోటాకు ఓట్లు పడకపోవడానికి కారణాలు ఉన్నాయి. ప్రజలు ఎవరు తక్కువ అవినీతిపరుడు చూసుకొని వారికి ఓటేస్తున్నారు తప్ప నోట జోలికి వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు.
మార్కెట్లో టమాటాలన్నీ పుచ్చులే ఉన్నప్పుడు వాటిలో కాస్త తక్కువ పుచ్చులు ఉన్న వాటిని ఏరుకుంటాం. ఇది అంతేనని ఆయన అన్నారు. ఎన్నికలు మానేయమంటే ప్రజలు మానేస్తారా టమాటాల విషయంలోనే కాదు ఇది అన్నింటికీ వర్తిస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్రాన్ని అడగటానికి భయపడి చంద్రబాబు నాయుడు తన మీద ఉన్న కేసులతో ఐదేళ్లు అడగడానికి భయపడ్డారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అడగడానికి భయపడుతున్నారని అన్నారు. కేసులు లేకుండా ఎవరున్నారు అని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రపంచంలో కెల్లా నేనే నిజాయితీపరున్ని అని చెప్పే కేజ్రివాల్ పై కూడా కేసు పెట్టారు. ఢిల్లీలో ప్రైవేట్ స్కూల్లో ఎవరు చేరకుండా అందరూ ప్రభుత్వ స్కూల్లోనే చేరే పరిస్థితి తెచ్చిన సిసోడియాను కూడా జైల్లో వేశారు.
సిసోడియా జైలుకెళ్ళి సంవత్సరం అవుతుంది. అతన్ని బయటకి రానివ్వరు ఇలా అందరినీ ఏరుతారు. దీనివల్ల నష్టం ఏంటి అని ప్రశ్నించారు. జైలుకెళితే ఓడిపోతాను అనడం అర్ధరహితం. జైలుకెళ్ళిన ప్రతివాడు గెలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్లేసి ముఖ్యమంత్రిగా గెలిచాడు. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల జైలుకి వెళ్ళాడు ఆయన కూడా సీఎం అవుతాడు అని ఉండవల్లి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. పార్లమెంట్ తలుపులు మూసి ఎంతో రగడ చేసి రాష్ట్ర విభజన చట్టం తయారు చేశారు. ఆ చట్టాన్ని అమలు చేయడానికి తిరగబడమని అంటున్నాం అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.