Undavalli Arun kumar : ఉండవల్లి అరుణ్ కుమార్ సర్వే .. ఏపీ సీఎం అతనే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Undavalli Arun kumar : ఉండవల్లి అరుణ్ కుమార్ సర్వే .. ఏపీ సీఎం అతనే..!

 Authored By aruna | The Telugu News | Updated on :5 February 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Undavalli Arun kumar : ఉండవల్లి అరుణ్ కుమార్ సర్వే .. ఏపీ సీఎం అతనే..!

Undavalli Arun kumar  : ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతున్నారు అనేదానిపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు.ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తర్వాత జరిగిన పరిణామాలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టి ఆయనను ఎండగట్టే ప్రయత్నం చేసేవారు.పోలవరం, ఏపీ విభజన చట్టంలోని హామీలు, ఏపీ ని విడదీసిన దానిపై వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు పై సీరియస్ అయ్యేవారు. గడిచిన ఏడాదికాలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ జగన్ మీద దూకుడు తగ్గించారు. వైయస్ జగన్ కు సంబంధించిన అంశాలలో రెండు మూడు ఉండవల్లి అరుణ్ కుమార్ కి మేలు జరిగాయి. వైయస్ జగన్ ప్రభుత్వ పరంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కి సంబంధించి అంశాలలో ఉండవల్లి అరుణ్ కుమార్ కి అడ్డుకట్ట వేశారు. విభజన కేసు పై ఉండవల్లి అరుణ్ కుమార్ పదేళ్లు గా పోరాడుతున్నారు.

ఆయనకు సపోర్టుగా ఏపీ ప్రభుత్వం ఆఫిడవిట్ వేసింది. అప్పటినుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ దూకుడు తగ్గింది. వైయస్ జగన్ పట్ల కాస్త సైలెంట్ గా ఉంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణ ప్రకారం సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలు అకౌంట్లోకి వేస్తున్న ముఖ్యమంత్రి ఎవరూ లేరు అని, ఎక్కడా లంచాలకు తావు లేకుండా వాలంటీర్లను ఉపయోగించుకొని ఆ డబ్బును అకౌంట్లోకి వేస్తున్నారు. ఇది ప్రజలకు నచ్చుతుంది. పట్టణాలలో కన్నా పల్లెటూర్లలో ప్రజలు వైయస్ జగన్ మళ్ళీ వస్తే మనకు డబ్బు వస్తుందని ఆలోచన చేస్తున్నారు. ఆ విశ్లేషణ ఉపయోగించుకొని ఇన్ డైరెక్ట్ గా వైయస్ జగన్ కి ఫేవర్ గా ఉండబోతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు.

ఏపీలో అభివృద్ధి లేదని రోడ్లు లేవని టీడీపీ కి సంబంధించిన మీడియా హైలెట్ చేస్తున్న ప్రజలు సంక్షేమ పథకాలపై మొగ్గుచూపుతున్నారు. కాబట్టి ఎవరికి ఓటేస్తారు అనేది చూడాలి అని ఆయన అంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ సీఎం గా వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల అకౌంట్లోకి పడుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఆయనే సీఎం గా వస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారు. కానీ ఏపీలో అభివృద్ధి లేదని యువతకు ఉద్యోగం రాలేదని పరిశ్రమలు లేవని అంటున్నారు కానీ పేద ప్రజలకు వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలు సక్సెస్ అయ్యాయి మరియు ముఖ్యంగా గ్రామాలలో ప్రజలు వైయస్ జగన్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కానీ ఎవరు గెలుస్తారు చివరిదాకా చెప్పలేని పరిస్థితి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది