Vallabhaneni Vamsi Wife : బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ భార్య
ప్రధానాంశాలు:
Vallabhaneni Vamsi Wife : బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ భార్య
Vallabhaneni Vamsi Wife : : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు కావడం గన్నవరం రాజకీయాలను పెనుమార్పు దిశగా నడిపిస్తోంది. ఈ అరెస్టు నేపథ్యంలో వంశీ భార్య పంకజశ్రీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందనే అంశం గన్నవరం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పంకజశ్రీకి ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.

Vallabhaneni Vamsi Wife : బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ భార్య
Vallabhaneni Vamsi Wife : వంశీ భార్య ఎంట్రీ తో గన్నవరం రాజకీయాలు మారబోతున్నాయా..?
భర్త రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి ఆమె సిద్దమవుతున్నట్టు సమాచారం. రాజకీయ వర్గాలు, నాయకులు ఆమెను ప్రోత్సహిస్తున్నారు. వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచినప్పటికీ, తరువాత రాజకీయంగా వైసీపీకి దగ్గరయ్యారు. తాజాగా వైసీపీ నేతలు గన్నవరంలో రేపు (మే 31) విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో భవిష్యత్ వ్యూహాలు, గన్నవరం అభివృద్ధికి అనుసరించాల్సిన కార్యాచరణలపై చర్చించనున్నారు.
పంకజశ్రీ కి రాజకీయ మద్దతు ఇవ్వాలా అనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక వైసీపీ వర్గాలు జూన్ 4న గన్నవరంలో “వెన్నుపోటు దినోత్సవం”ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.