Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి పెద్ద దెబ్బే తగిలిందిగా.. రిమాండ్ పొడిగింపు
ప్రధానాంశాలు:
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి పెద్ద దెబ్బే తగిలిందిగా.. రిమాండ్ పొడిగింపు
Vallabhaneni Vamsi : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో తమపై విమర్శలు చేసిన వారి తాట తీస్తున్న విషయం తెలిసిందే. అయితే గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం మరోసారి రిమాండ్ ను పొడిగించింది. వల్లభనేని వంశీని జైలు అధికారులు నేడు వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వంశీకి మార్చి 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Vallabhaneni Vamsi :వల్లభనేని వంశీకి పెద్ద దెబ్బే తగిలిందిగా.. రిమాండ్ పొడిగింపు
Vallabhaneni Vamsi : గడ్డు పరిస్థితులు..
ఈకేసులో వంశీతో పాటు మరో ఐదుగురు జిల్లా జైలులో ఉన్నారు. వంశీని పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఇటీవల పోలీసులు పిటిషన్ వేయగా.. కోర్టు మూడు రోజులు మాత్రమే కస్టడీకి ఇచ్చింది. అయితే విచారణలో వంశీ ఏమాత్రం సహకరించలేదని పోలీసులు తెలిపారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటి వేసిన నేపథ్యంలో మరోసారి పదిరోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు. దీనిపై రెండు రోజుల పాటు వాదనలు జరిగాయి.
అయితే మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వడం, అనారోగ్య కారణాల నేపథ్యంలో పోలీసులు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బ్యారక్ మార్చాలంటూ వంశీ వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు.. బ్యారక్ మార్చడం సాధ్యంకాదని కోర్టు స్పష్టం చేసింది. అయితే అనారోగ్య కారణాల వల్ల దిండు, దుప్పటి ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనెల 25 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రేపు బెయిల్‌పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.