Vangalapudi Anitha : నా మీద చేయి వేస్తే మర్యాదగా ఉండదు.. పోలీసులు అనితను ఎత్తి లోపల పడేశారు
Vangalapudi Anitha : టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి ఎమ్మెల్యే తెలుసు కదా. తనను ఈ మధ్య పోలీసులు చాలాసార్లు టార్గెట్ చేశారు. ఇదివరకు ఒకసారి కూడా కలెక్టర్ నిర్వహించే ప్రజా స్పందన కార్యక్రమానికి వెళ్తుంటే పోలీసులు ఆపారు. తన ఇంటి వద్దనే బంధించారు. తన ఇంటి గేటుకు తాళం వేసి తనను ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదు. దీంతో అనిత పోలీసులతో చాలాసేపు వాగ్వాదించారు. అసలు తనను ఎందుకు బయటికి వెళ్లకుండా ఆపుతున్నారంటూ పోలీసులపై అనిత […]
Vangalapudi Anitha : టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి ఎమ్మెల్యే తెలుసు కదా. తనను ఈ మధ్య పోలీసులు చాలాసార్లు టార్గెట్ చేశారు. ఇదివరకు ఒకసారి కూడా కలెక్టర్ నిర్వహించే ప్రజా స్పందన కార్యక్రమానికి వెళ్తుంటే పోలీసులు ఆపారు. తన ఇంటి వద్దనే బంధించారు. తన ఇంటి గేటుకు తాళం వేసి తనను ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదు. దీంతో అనిత పోలీసులతో చాలాసేపు వాగ్వాదించారు. అసలు తనను ఎందుకు బయటికి వెళ్లకుండా ఆపుతున్నారంటూ పోలీసులపై అనిత ఫైర్ అయ్యారు. అదంతా పక్కన పెడితే మరోసారి అనితను పోలీసులు టార్గెట్ చేశారు. వైజాగ్ నడి రోడ్డు మీద అనితపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఒక మాజీ ఎమ్మెల్యే, మహిళా నాయకురాలు అని కూడా చూడకుండా తనపై దారుణంగా ప్రవర్తించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న అనితను లేడీ పోలీసులు పట్టుకొని మరీ పోలీసు జీపులోకి ఎక్కించబోతారు. దేనికి నన్ను ఎక్కిస్తున్నారు. దేనికి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకో కారణం చెప్పండి అని ఎంత అడిగినా కూడా పోలీసులు మాత్రం అస్సలు పట్టించుకోలేదు. నడి రోడ్డు మీద రచ్చ రచ్చ చేశారు. రుషికొండ మీద జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించడానికి వెళ్లబోతుంటే.. ఆమెను అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత దారుణంగా ఆమెను లాగి మరీ పోలీసు జీపులో పడేశారు. మేము ఏమన్నా దొంగలమా? ఎంత దారుణంగా మమ్మల్ని లాగి పడేశారు అంటూ అనిత సీరియస్ అయ్యారు.
Vangalapudi Anitha : ఇలాంటి ప్రభుత్వమా మనకు కావాల్సింది?
ఉత్తరాంధ్ర లీడర్స్ అందరం కలిసి రుషికొండ అక్రమాలపై ప్రజలను చూపించాలని చెప్పి నాలుగు ఐదు ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. కానీ.. అక్కడికి వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. ఒక దొంగలను పట్టుకున్నట్టు, హత్యలు చేసిన వాళ్లను పట్టుకున్నట్టు, ఉదయం నుంచి పోలీసులు మా వెంట పడుతున్నారు. మా పర్సనల్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేయనీయడం లేదు. ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్తే అక్కడికీ పోలీసులు వచ్చారు. పార్టీ ఆఫీసుకు వెళ్తున్నాం. రిషికొండకు వెళ్లడం లేదు అంటే కూడా పోలీసులు వినకుండా దారుణంగా మమ్మల్ని లాక్కొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేశారు అంటూ అనిత కన్నీటి పర్యంతం అయ్యారు.