Vangalapudi Anitha : ఇలా చేస్తే జగన్ దేశ బహిష్కరణ.. హోం మంత్రి సంచలన కామెంట్స్..!
Vangalapudi Anitha : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శల వర్షం కురుస్తుంది. కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు జగన్‌ని విమర్శిస్తూ వస్తున్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటన ఆపేసుకున్నారని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. నేడు మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వంగలపూడి అనిత మాట్లాడుతూ జగన్ పై దేశ బహిష్కరణ వ్యాఖ్యలు చేశారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెబుతున్నవన్నీ […]
ప్రధానాంశాలు:
Vangalapudi Anitha : ఇలా చేస్తే జగన్ దేశ బహిష్కరణ.. హోం మంత్రి సంచలన కామెంట్స్..!
Vangalapudi Anitha : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శల వర్షం కురుస్తుంది. కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు జగన్‌ని విమర్శిస్తూ వస్తున్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటన ఆపేసుకున్నారని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. నేడు మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వంగలపూడి అనిత మాట్లాడుతూ జగన్ పై దేశ బహిష్కరణ వ్యాఖ్యలు చేశారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెబుతున్నవన్నీ కుంటిసాకులేనని ఆమె అన్నారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికీ, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నాడని విమర్శించారు.
Vangalapudi Anitha జగన్‌పై ఫైర్..
డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏనాడూ తిరుమల లడ్డూ తినని జగన్ నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. డిక్లరేషన్ ఇవ్వమంటే దళితుల అంశాన్ని ముడిపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం జగన్ చేశాడని అనిత దుయ్యబట్టారు. జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్గా దళితులకు అవకాశం ఇచ్చారా? అని మంత్రి నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారని గుర్తుచేశారు. హిందూ, దళితురాలైన తనకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే బ్లూ మీడియాలో రాద్దాంతం చేసి అది పోగొట్టేలా చేసింది జగనేనని విమర్శించారు.
జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లీ, చెల్లిని చూస్తేనే అందరికి అర్ధమవుతుందని అన్నారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్ను దేశ బహీష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సెల్ఫ్ గోల్స్ తో తనని దేశ బహీష్కరణ చేయాలని పరిస్థితి జగనే తెచ్చుకున్నాడని అన్నారు. పూటకో మాట జగన్ కు బాగా అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని, అయితే నోటీసులు ఇవ్వడం వలన తాను తిరుమల పర్యటన రద్దు చేసుకున్నానని చెబుతున్నారని కానీ జగన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలు అంటూ ఆరోపించారు. జగన్ తాను చెప్పే అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని వంగలపూడి అనిత పేర్కొన్నారు.