Vangalapudi Anitha : పవన్ కళ్యాన్ చేసిన ఘాటు వ్యాఖ్యలకి స్పందించిన హోం మినిస్టర్ అనిత
Vangalapudi Anitha : పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చాలా కూల్‌గా కనిపిస్తూ వచ్చారు. అయితే ఆయన తాజాగా జరిగిన పిఠాపురం బహిరంగ సభలో ఆవేశంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. అమరావతి – ఏపీలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్‌గా స్పందించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ..రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.హోంమంత్రి అనిత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహించాలని సూచించారు. […]
ప్రధానాంశాలు:
Vangalapudi Anitha : పవన్ కళ్యాన్ చేసిన ఘాటు వ్యాఖ్యలకి స్పందించిన హోం మినిస్టర్ అనిత
Vangalapudi Anitha : పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చాలా కూల్‌గా కనిపిస్తూ వచ్చారు. అయితే ఆయన తాజాగా జరిగిన పిఠాపురం బహిరంగ సభలో ఆవేశంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. అమరావతి – ఏపీలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్‌గా స్పందించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ..రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.హోంమంత్రి అనిత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహించాలని సూచించారు. హోంశాఖ కూడా తానే తీసుకోవాల్సిందన్న పవన్.. తానే హోంమంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు పలు రకాలుగా ముచ్చటించుకుంటున్నారు.
Vangalapudi Anitha పవన్ వ్యాఖ్యలపై వివరణ..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించడం సరికాదన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూసి తాను ఆయనతో మాట్లాడానని.. అక్కడేం జరిగిందో ఆయన వివరించారన్నారు. ఓ యువతి పిఠాపురంలో జరిగిన సమావేశంలో.. గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాల గురించి ప్రస్తావించారన్నారు. ఆ యువతి కులం చూసి కేసులు కట్టారని ఆవేదన వ్యక్తం చేశారని.. దీంతో చలించిపోయిన పవన్ కళ్యాణ్ కులాలు చూసి కేసులు నమోదు చేయడమేంటని ఆ అంశాన్ని ప్రస్తావించారన్నారు. పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో పని చేసిన పోలీసుల తీరును తప్పుపట్టారని.. ఇలాంటి వాటిపై బాధ్యత తీసుకోవాలని తమకు సూచించారన్నారు. ఈ అంశాలను తాము పాజిటివ్‌గా తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, నేను పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. తమలో పవన్ కల్యాణ్ కూడా భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టే మాట్లాడారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన దానికి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు. త్వరలోనే ఆయనతో మాట్లాడతా. పిఠాపురం సభలో మాట్లాడిన దానిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని నాకు తెలుసంటూ పవన్ తనపై చేసిన వ్యాఖ్యలపై అనిత వివరణ ఇచ్చారు.హోంమంత్రిగా తాను విఫలమైనట్లు పవన్ కళ్యాణ్ ఎక్కడా చెప్పలేదన్నారు వంగలపూడి అనిత. కొంతమంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఆడపిల్లలపై అసభ్యకర పోస్టులతో రెచ్చిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.