Venu Swamy : 2024 లో జగనే సీఎం.. బల్ల గుద్ది మరీ చెప్పిన వేణు స్వామి.. కానీ చిన్న సమస్య అంటూ అంటూ అసలు బాంబు పేల్చేశాడు
ప్రధానాంశాలు:
టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే జగన్ కు కష్టం
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?
చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా?
Venu Swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన జ్యోతిష్యంలో పండితుడు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆయనతో జాతకం చెప్పించుకుంటారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు, రాజకీయ సెలబ్రిటీలు ఆయన అపాయింట్ మెంట్ కోసం క్యూ కడుతుంటారు. అంతటి క్రేజ్ ఆయనకు ఉంది. ఎప్పుడైనా ఎన్నికలు వస్తే చాలు.. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు అని ముందే చెప్పేస్తారు వేణు స్వామి. 2019 ఎన్నికల్లో జగన్ గెలుస్తారని ముందే చెప్పి అప్పట్లో వార్తల్లోకెక్కారు వేణు స్వామి. తాజాగా 2024 ఎన్నికల గురించి మాట్లాడారు. చంద్రబాబు ఈ మధ్య కాలంలో రింగ్ పెట్టుకున్నారు. ఆయన పెట్టుకోవడానికి కారణం.. మానసికమైన స్టెబిలిటీకి పెట్టుకున్నారు. వాళ్ల ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లమ్ ఉంది. న్యూరో రిలేటెడ్ ఇష్యూ ఉంది. దాని కోసం, తన ఆరోగ్యాన్ని నిలుపుకోవడం కోసం పెట్టుకున్న రింగ్ అది. టీజీ వెంకటేశ్ అబ్బాయి టీజీ భరత్ నన్ను కలిసి.. ఈసారి టీడీపీ ప్రభుత్వం రావడానికి పూజలు చేయిద్దాం అన్నాడు. దీంతో నేను ఏమన్నా అంటే మీరు కాదు.. చంద్రబాబు గారిని ఒప్పించండి అని అన్నా. దీంతో జగన్ కు మీరు మద్దతుగా ఉంటారు కదా. మీరు చేస్తరా అని అడగడంతో మా నాన్న నాకు ఏం చెప్పారంటే.. కులమతాలతో సంబంధం లేదు. ఎవరు వచ్చినా చేయి అని చెప్పాడు. నేను అలాగే చేస్తా అని చెప్పాను అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.
ఏపీలో రాజకీయాలు విచిత్రంగా ఉంటున్నాయి. సీఎం జగన్ ఎన్ని పథకాలు పెట్టినా కూడా జనాలకు ఉచితంగా డబ్బులు ఇస్తున్నా కూడా ప్రజలు ఆలోచనా విధానం విచిత్రంగా ఉంది. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై ఎలాంటి డౌట్ లేదు. 2024 లో జగనే మళ్లీ సీఎం. 2024 లో నూటికి నూరు శాతం జగన్ వస్తారు. ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడు పార్టీలు మాత్రం కలిసి పోటీ చేస్తే మాత్రం చెప్పలేం. అప్పుడు ఈ కూటమి గెలిచే చాన్స్ ఉంది. అప్పుడు రెండున్నర ఏళ్లు చంద్రబాబు, మరో రెండున్నర ఏళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.
Venu Swamy : చంద్రబాబు పెట్టుకుంది రింగ్ మాత్రమే
చంద్రబాబు పెట్టుకున్న రింగ్ అది కేవలం ఆరోగ్యం కోసమే. అందులో ఎలాంటి రాజకీయాలు లేవు. ఆయన పెట్టుకున్నది వెండి రింగ్. పవన్ కళ్యాణ్ ది మకర రాశి. అందుకే ఆయన పగడపు ఉంగరం పెట్టుకున్నారు. దాన్ని పవిత్రం అంటారు. అది రాజయోగం కోసం పెట్టుకుంటారు.. అని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. ఒకవేళ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే యోగం ఉంది కానీ.. మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని చెప్పుకొచ్చారు వేణు స్వామి.