Pawan Kalyan : జగన్, చంద్రబాబులపై పవన్ విమర్శల వీడియో వైరల్..!!
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర తో ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి భాగస్వాముల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలను పవన్ కళ్యాణ్ ఈసారి చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. 2019 ఎన్నికలలో రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. ఒక పార్టీ అధ్యక్షుడిగా దేశంలో పోటీ చేసే ఓటమి చెందటంతో ప్రత్యర్థులు చాలా అవమానపరచడం జరిగింది.
ఇటువంటి పరిస్థితులలో జరగబోయే ఈసారి ఎన్నికలలో.. కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతానని పవన్ కళ్యాణ్ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. దేశ సమయంలో వైఎస్ జగన్ ని గద్దె దింపటమే తన టార్గెట్ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ని అదే విధంగా చంద్రబాబుని పవన్ విమర్శిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈసారి జరగబోయే ఎన్నికలలో.. జగన్ నీ ఓడిస్తానని చెప్పిన పవన్.. చంద్రబాబుతో ఏ రకంగా వ్యవహరిస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం బీజేపీ పార్టీతో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఇదే సమయంలో బీజేపీ…టీడీపీ పార్టీని చాలా దూరంగా పెడుతూ ఉంది. కానీ పవన్ చంద్రబాబుతో కలిసి.. రాజకీయాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు.. ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి పవన్ టీడీపీ… పార్టీని పక్కన పెడుతున్న బిజెపితో కలసి.. పని చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.