Vidadala Rajini : విడదల రజని కి భారీ దెబ్బ గ్యారెంటీ ? వైసీపీ లో డేంజర్ బెల్స్..!
Vidadala Rajini : ఏపీలో ఎమ్మెల్సీల హడావిడి మరోసారి తెరపైకి వస్తోంది. వచ్చేనెలలో భర్తీ గానున్న ఎమ్మెల్సీ స్థానాలలో అధికార పార్టీ వైసీపీ Ysrcp నాయకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్ కి అవకాశం దక్కుతుందో లేదో అన్నది పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే మరి రాజశేఖర్ మొదటినుండి జగన్ కి వీర విధేయుడు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉంటూ వస్తున్నారు. దీంతో 2014 ఎన్నికల సమయంలో చిలకలూరిపేట వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుపై ఓడిపోయారు. కానీ ఆ తర్వాత 2019 ఎన్నికలలో వైయస్ జగన్ విడుదల రజినికీ చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఎన్నికల సమయంలో విడుదల రజినినీ ఎమ్మెల్యేగా గెలిపించండి… రాజశేఖర్ అన్నను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసుకుందామని చిలకలూరిపేట ప్రజలకు జగన్ మాట ఇచ్చారు. కానీ ఎన్నికల అయిన తర్వాత మరి రాజశేఖర్ కి ఇప్పటివరకు పదవి దక్కలేదు.
మరోపక్క ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి విడుదల రజిని ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాణిస్తున్నారు. అయినా తనకి ఏ పదవి రాకపోయినా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎక్కడ కూడా అసంతృప్తి వెళ్ళబుచ్చకుండా మరి రాజశేఖర్ వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో విడుదల రజిని వర్సెస్ మర్రి రాజశేఖర్ అనే పరిస్థితి నెలకొంది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి ఎవరు వ్యూహాలు వారు వేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో మరి రాజశేఖర్ కి తోడుగా పల్నాడు జిల్లాకి చెందిన మరికొంతమంది నాయకులు తోడయ్యారట. ఇద్దరూ కలిసి చిలకలూరిపేటలో విడుదల రజనీకి వ్యతిరేకంగా పలు రాజకీయాలు చేసినట్లు కూడా వార్తలు రావడం జరిగాయి. ఇదిలా ఉంటే మార్చిలో మర్రి రాజశేఖర్ కి సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామంతో విడుదల రజనీకి చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ దెబ్బ గ్యారెంటీ అని ఇది వైసిపి పార్టీలో డేంజర్ బెల్స్ కి సంకేతమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు అంతకుముందు ఒకరిపై మరొకరు ఆదిపత్య ధోరణి ప్రదర్శించిన నేతలకు ఒకేసారి పదవి కట్టబెట్టడం.. పార్టీలో అంతర్గత విభేదాలు మరింత తారా స్థాయికి తీసుకెళ్ళే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు.