Vote For Note Case : బిగ్ బ్రేకింగ్‌.. చంద్ర‌బాబుకు భారీ ఊర‌ట‌.. పిటిష‌న్లు కొట్టేసిన సుప్రీంకోర్టు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vote For Note Case : బిగ్ బ్రేకింగ్‌.. చంద్ర‌బాబుకు భారీ ఊర‌ట‌.. పిటిష‌న్లు కొట్టేసిన సుప్రీంకోర్టు

Vote For Note Case : ఓటుకు నోటు కేసు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుపై ఈ కేసులో ఆరోపణలు వెల్లువెత్తాయి. 2015లో తెలంగాణ, పాక్షికంగా ఏపీ రాజకీయాలను కుదిపేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పాత్రపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 August 2024,4:56 pm

ప్రధానాంశాలు:

  •  Vote For Note Case : బిగ్ బ్రేకింగ్‌.. చంద్ర‌బాబుకు భారీ ఊర‌ట‌.. పిటిష‌న్లు కొట్టేసిన సుప్రీంకోర్టు

Vote For Note Case : ఓటుకు నోటు కేసు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుపై ఈ కేసులో ఆరోపణలు వెల్లువెత్తాయి. 2015లో తెలంగాణ, పాక్షికంగా ఏపీ రాజకీయాలను కుదిపేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పాత్రపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.

అయితే, ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నయీంను నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.ఈ కేసులో చంద్రబాబుపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంలో ఎలాంటి విశ్వాసం లేదని కోర్టు పేర్కొంది. రాజకీయ పగ కోసం కోర్టును వినియోగించ‌రాద‌ని ఆళ్ల‌ను మంద‌లించింది.

Vote For Note Case బిగ్ బ్రేకింగ్‌ చంద్ర‌బాబుకు భారీ ఊర‌ట‌ పిటిష‌న్లు కొట్టేసిన సుప్రీంకోర్టు

Vote For Note Case : బిగ్ బ్రేకింగ్‌.. చంద్ర‌బాబుకు భారీ ఊర‌ట‌.. పిటిష‌న్లు కొట్టేసిన సుప్రీంకోర్టు

ఈ కుంభకోణంలో చంద్రబాబు నాయుడును ఇరికించాలన్న రామకృష్ణారెడ్డి పిటిషన్‌ను కూడా కొట్టివేసిన హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పు వైఎస్సార్సీపీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది