YCP Leaders : వైసీపీ నేతలంతా వెనక్కి తగ్గుతున్నారేందుకు.. ప్లానింగా లేదా ముందు జాగ్రత్త..?
YCP Leaders : కూటమి గెలుపుని కొందరు వైసీపీ నేతలు కూడా సమర్థించే పరిస్థితి వచ్చింది అంటే వైసీపీ డౌన్ ఫాల్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ పార్టీలోని నేతలు ప్రస్తుతం అధికారం లో ఉన్న ప్రభుత్వానికి కొద్దిగా టైం ఇద్దాం అని చెప్పడం అందరికి షాక్ ఇస్తుంది. మొన్నటిదాకా కస్సు బుస్సు అంటూ ఎగిరిన నేతలంతా కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎక్కువ మాట్లాడితే ఎక్కడ పాత కేసులు తీసి జైల్లో వేస్తారన్న భయమో లేదా మరో కారణమో కానీ వైసీపీ నేతల్లో ఈ మార్పులు ప్రజలను కూడా ఆలోచనలో పడేస్తుంది. ఈమధ్య కేతిరెడ్డి రిలీజ్ చేసిన వీడియో చేసి వైసీపీ నేతల్లో కూడా థింకింగ్ మొదలైంది. కూటమి ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలని జాబ్ కాలెండర్ వరకు చూడాలని కేతిరెడ్డి మాట్లాడడం నేతల్లో ఆందోళన మొదలైంది. ఇలా తమ పార్టీకి చెందిన వారే కూటమికి టైమ్ ఇవ్వాలని అంటే ఎలా అని కొందరు నేతలు వాపోతున్నారు.
YCP Leaders : ఎవరి ఆలోచన వారిదే..
వైసీపీ నేతల్లో ఇప్పుడు మరో ఆలోచన ఏంటంటే ఎక్కువ పార్టీ కోసం నానా హంగామా చేసినా అక్కడ ఏమి లాభం చేరే అవకాశం లేదు. అందుకే ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా సైలెంట్ గా ఉంటున్నారు. అంతేకాదు వైసీపీ లో ఉన్న సీనియర్స్ కూడా పార్టీ ఓటమి విధివిధానాల మీద ఎలాంటి నిర్ణయం బయట పడట్లేదు. వాళ్లంతా సీక్రెట్ గా ఎవరి ప్లాన్ లో వారు ఉన్నట్టు తెలుస్తుంది.
కూటమి పాలన మీద ఏ మాత్రం ఛాన్స్ దొరికినా వదలకూడదు అని వైఎస్ జగన్ ఉంటే ఆ పార్టీ ముఖ్య నేతలు పార్టీకి అండగా ఉండాల్సిన వారు మాత్రం హడావిడి చేయాల్సిన టైమ్లో సైలెంట్ అయిపోయారు. ఈ విషయం లో వైసీపీ నేతలు దీర్ఘఆలోచన దేనికి సంకేతం అన్నది చూడాలి. మరో పక్క పార్టీ సీనియర్ నేతలు వైసీపీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్లే ప్లాన్ లో ఉన్నారన్న దాని మీద కూడా వైసీపీ పార్టీలో పెద్ద చర్చ నడుస్తుంది.