TDP – Janasena Alliance : టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ సై అంటోందా? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?
ప్రధానాంశాలు:
టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లనున్న బీజేపీ?
చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన బీజేపీ
ఆ మూడు పార్టీలు కలిసినట్టేనా?
TDP – Janasena Alliance : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 5 నుంచి 6 నెలల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి మాత్రం ఏపీలో మొదలైంది. దానికి కారణాలు అందరికీ తెలుసు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం అయితే అప్పటి వరకు గెలిచే చాన్స్ ఉంటుందని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. నిజానికి ఏపీలో పోటీ అంటే అధికార వైసీపీ, టీడీపీ అండ్ జనసేన మధ్యనే. టీడీపీ, జనసేన రెండు పార్టీలు ఈసారి కలిసి పోటీ చేస్తున్నట్టు ఇటీవలే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన పొత్తు ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉన్నప్పుడే కన్ఫమ్ అయింది. ఏది ఏమైనా ఈసారి జగన్ మళ్లీ గెలవకూడదు. ఆయన మళ్లీ అధికారంలోకి రాకూడదు. దాని కోసమే ఈ ఎత్తుగడలు అన్నీ. జగన్ సీఎం కాకుండా ఇంకెవ్వరు అయినా ప్రాబ్లమ్ లేదు అన్నట్టుగా ఏపీలో రాజకీయాలు సాగుతున్నాయి. అందుకే కదా టీడీపీ, జనసేన కూడా ఒక్కటయింది. మరోవైపు ఈ టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కూడా కలవబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి జనసేన పార్టీ బీజేపీతో ఎప్పుడో కూటమి కట్టింది. పేరుకు కూటమి కట్టింది కానీ.. బీజేపీ అధికారిక కార్యక్రమాల్లో జనసేన అయితే ఇప్పటి వరకు పాల్గొనలేదు. ఆ తర్వాత జనసేనతో బంధం తెంచుకొని ఇప్పుడు టీడీపీ వైపు మొగ్గు చూపుతోంది జనసేన.
నిజంగానే ఈ మూడు పార్టీలు కలిస్తే ఏపీలో రాజకీయాలు మొత్తం యూ టర్న్ తీసుకుంటాయి. ఎందుకంటే.. మూడు పార్టీలు కలిస్తే వైసీపీ ఓడిపోవడం పెద్ద కష్టమేమీ కాదు. నిజానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితులు అయిన తర్వాత ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఆమె ఏకపక్షంగా వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అలాగే టీడీపీని సమర్థిస్తున్నారు. అంటే.. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది అనే సిగ్నల్స్ ను బీజేపీ తీసుకెళ్తోందని అర్థం అవుతోంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఎల్లో మీడియా కూడా రెచ్చిపోతోంది. ఆ మూడు పార్టీలు ఒక్కటయినట్టే అన్నట్టుగా కథనాలను వండి వార్చుతున్నాయి.
TDP – Janasena Alliance : చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన బీజేపీ
నిజానికి చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండించింది. దీంతో చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడంతోనే ఆగిపోకుండా.. బీజేపీ.. టీడీపీకి అన్ని విధాలా మద్దతు పలుకుతోంది. అధికార వైసీపీ అక్రమాలపై కూడా విరుచుకుపడుతోంది. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ, జనసేనతో కలిసే వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?