Lady Inspector : ఆ లేడీ ఇన్స్పెక్టర్ వెనక ఉన్న పెద్ద తలకాయలు బయటకి వస్తాయా?
Lady Inspector : ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అదే కేసుకు సంబంధించి చర్చ నడుస్తోంది. అదే 2 వేల రూపాయల నోట్ల మార్పిడి కేసు. ఆ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవును.. వైజాగ్ కేంద్రంగా రెండు వేల నోట్ల మార్పిడి చాలా సీరియస్ ఇష్యూ అయింది. దానికి కారణం పోలీస్ విభాగానికి చెందిన వాళ్ల పాత్ర ఇందులో ఉండటమే కారణం. ఏఆర్ ఇన్ స్పెక్టర్ స్వర్ణలతతో పాటు మరో ముగ్గురు ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. వాళ్ల మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. వాళ్లను అరెస్ట్ కూడా చేశారు.
అసలు ఈ వ్యవహారం ఎలా మొదలైందంటే.. రాత్రి పూట విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత టీమ్ కు రూ.90 లక్షల విలువైన రూ.2 వేల నోట్ల కట్టలతో సూరిబాబు అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతడిని బెదిరించి ఆ కట్టల్లోని రూ.15 లక్షలు స్వర్ణలత తీసుకుంది. దీంతో వైజాగ్ సీపీకి నౌకాదళ సిబ్బంది అయిన కొల్లి శీను, శ్రీధర్ ఫిర్యాదు చేయడంతో స్వర్ణలతపై నిఘా పెట్టిన పోలీసులు.. ఆమె ఆ డబ్బులు తీసుకున్నట్టు గుర్తించారు. వెంటనే కేసు నమోదు చేసి ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.నిజానికి నౌకాదళానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ దగ్గర ఉన్న రూ.2 వేల రూపాయల నోట్లను మార్చేందుకు సూరిబాబు అనే మధ్యవర్తిని ఆశ్రయించారు. వీళ్ల డీల్ ఏంటంటే.. రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇవ్వాలి. దానికి కోటి విలువైన రూ.2000 నోట్లు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.
Lady Inspector : 2 వేల నోట్లను మార్చే క్రమంలో జరిగిన తతంగమే ఇది
సూరిబాబు.. స్వర్ణలత దగ్గర హోంగార్డులుగా పని చేస్తున్న శ్యామ్ సుందర్, శ్రీనులను ఆశ్రయించాడు. కానీ.. హోంగార్డులు మధ్యలో ప్లేట్ ఫిరాయించి సూరిబాబును బెదిరించి రూ.20 లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బును స్వర్ణలతతో కలిసి ఆ ఇద్దరు పంచుకున్నారు. ఈ విషయం నౌకాదళ సిబ్బందికి తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీగ లాగితే డొంక మొత్తం కదిలింది.