YS Jagan : మళ్లీ నేనే సీఎం .. వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తా.. మరోసారి తెరపైకి రాజధాని అంశం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : మళ్లీ నేనే సీఎం .. వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తా.. మరోసారి తెరపైకి రాజధాని అంశం..!

 Authored By tech | The Telugu News | Updated on :7 March 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : మళ్లీ నేనే సీఎం .. వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తా.. మరోసారి తెరపైకి రాజధాని అంశం..!

YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఇక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా నేనే గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా వైయస్ జగన్ వైజాగ్ లో మాట్లాడుతూ ఈసారి నేనే ముఖ్యమంత్రిగా గెలుస్తా. వైజాగ్ లోనే ప్రమాణస్వీకారం చేస్తా అని వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా వైయస్ జగన్ వైజాగ్ వెళతారని, అక్కడే ఉండి ఆంధ్రప్రదేశ్ పాలన సాగిస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆయన ఇంతవరకు వైజాగ్ షిఫ్ట్ అవ్వలేదు. కానీ అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన సీఎం అయితే వైజాగ్ లోనే ఉంటానని చెప్పడం వెనుక రెండు అంశాలు ఉన్నాయి. మళ్లీ ముఖ్యమంత్రి నేనే అని కాన్ఫిడెన్స్ గా చెప్పడం, రెండవది వైజాగ్ రాజధాని అనే అంశాన్ని తెర పైకి తేవడం.

రాజధానిగా అమరావతి పై చర్చలు మొదలయ్యాయి. గతంలో రాజధాని కోసం రైతుల కష్టాలు ఉద్యమాలు గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం వాళ్లను చర్చలకు కూడా పిలిపించలేదు. రాజధాని విషయంలో వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలి. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదని అంశం ఎలక్షన్స్ పై ప్రభావితం కాదని అంటున్నారు. అమరావతి రాజధాని కావాలని కృష్ణ, కోస్తా, గుంటూరు, ప్రకాశం ప్రజలు కోరుకుంటారేమో కానీ రాజధాని ఇవ్వనందుకు వైయస్ జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని మాత్రం చెప్పరు. ఉత్తరాంధ్ర ప్రజాలు, వైజాగ్ ప్రజలు వైజాగ్ రాజధాని ఇస్తున్నాడని వైయస్ జగన్ కి ఓటు వేస్తామని అనరు. అయితే రాజధాని ఎక్కడైనా పెట్టండి, రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకురండి అని ప్రజలు భావిస్తున్నారు.

అయితే వైయస్ జగన్ వైజాగ్ వస్తానని చెప్పడం గెలిచిన తర్వాత ప్రమాణస్వీకారం వైజాగ్ లోనే జరగబోతుంది అని చెప్పడం వెనుక పెద్ద స్ట్రాటజీ కనిపిస్తుంది. గుంటూరు, విజయవాడ ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాలన్నీ పవన్ కళ్యాణ్ పొత్తు కారణంగా టీడీపీ జనసేనకు ఓటు వేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే వైయస్ జగన్ టీడీపీని క్లీన్ స్వీప్ గా ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రను హైలెట్ చేయడానికి వైయస్ జగన్ చూస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ ను హైలెట్ చేయడానికి వైఎస్ జగన్ ఆసక్తి చూపిస్తున్నారు. గుంటూరు, విజయవాడ, ఉభయగోదావరి ప్రాంతాలలో వైసీపీ గెలవదని స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వైయస్ జగన్ ఉత్తరాంధ్రలో కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే అక్కడ వైజాగ్ ను హైలెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది