YCP : నెల్లూరు గడ్డ వైసీపీ అడ్డా .. తిరుగులేని నెంబర్ రాబోతోంది !
YCP : ఏపీ రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే.. అందులో నెల్లూరు జిల్లా రాజకీయాలు మరో ఎత్తు. అవును.. నెల్లూరు రాజకీయాలు, అక్కడి రాజకీయ నాయకుల పంథానే వేరు. నెల్లూరు జిల్లాలో సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీద చాలా రోజుల నుంచి టీడీపీ నేతలు పలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ మీద కోపంగా ఉన్నారని.. త్వరలోనే ఆయన పార్టీ మారుతారని అన్నారు. ఆయన్ను మంత్రి పదవి నుంచి తీసేయడంతో ఆయన అధిష్ఠానంపై కోపంగా ఉన్నారని టీడీపీ నేతలు రాద్ధాంతం చేసినా చివరకు తాను వైసీపీని వీడేది లేదని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
దీంతో టీడీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నెల్లూరు టీడీపీలో అంతగా ప్రాబల్యం ఉన్న నేతలు ఎవరూ లేరు. ఏదో వైసీపీ నుంచి రెబల్ గా మారిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ఉన్నారు. కానీ.. ఆయనకు ఇప్పుడు అంత సీన్ లేదు. టీడీపీకి పోటీగా నిలబడి గెలిచి ఇప్పుడు టీడీపీ చెంతకే చేరారు కోటంరెడ్డి. అది వచ్చే ఎన్నికల్లో వైసీపీకే ప్లస్ కానుంది. ఏదో తమకు లీడర్లు ఉన్నారు. నెల్లూరు మాదే అని టీడీపీ నేతలు అనుకుంటున్నారు కానీ.. అది వాళ్లకు మిస్ ఫైర్ అవుతుందని గ్రహించలేకపోతున్నారు.
YCP : నెల్లూరు ఎప్పటికైనా వైసీపీకి కంచుకోటే
నెల్లూరు జిల్లా ఎప్పుడైనా వైసీపీకి కంచుకోటే. వైసీపీ పార్టీలో ఏదో ప్రస్తుతం కొన్ని విభేదాలు ఉండొచ్చు కానీ.. ఎన్నికల సమయానికి అవన్నీ పరిష్కారం అవుతాయి. అసలు సరైన క్యాడర్ లేకనే వైసీపీ పార్టీ నుంచి నేతలను టీడీపీ తమ పార్టీలోకి లాక్కుంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నెల్లూరు జిల్లాలో తమ పరిస్థితి గురించి ఆలోచించుకోవాలి. నెల్లూరు జిల్లా ఇప్పుడే కాదు.. ఎప్పుడైనా వైసీపీకే కంచుకోట. అది గుర్తుపెట్టుకొని టీడీపీ నేతలు మసులుకుంటే మంచిది.