Ycp : కూట‌మి వైపు ప‌రుగులు పెడుతున్న వైసీపీ గణం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ycp : కూట‌మి వైపు ప‌రుగులు పెడుతున్న వైసీపీ గణం..!

Ycp : ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి దారుణంగా మారింది. ఏపీలో కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక వైసీపీ నుండి నాయ‌కులు ఒక్కొక్క‌రుగా జంప్ అవుతున్నారు. ఆ పార్టీనే కొన్నేళ్లుగా అంటి పెట్టుకుని వీర విధేయనేతగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేదిలేదని ప్రకటించారు. దీంతో ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యింది. ఇంతకుముందే ఏలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు రాజీనామా చేయగా, ఇంకొందరు […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 October 2024,8:30 pm

Ycp : ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి దారుణంగా మారింది. ఏపీలో కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక వైసీపీ నుండి నాయ‌కులు ఒక్కొక్క‌రుగా జంప్ అవుతున్నారు. ఆ పార్టీనే కొన్నేళ్లుగా అంటి పెట్టుకుని వీర విధేయనేతగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేదిలేదని ప్రకటించారు. దీంతో ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యింది. ఇంతకుముందే ఏలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు రాజీనామా చేయగా, ఇంకొందరు అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఆళ్ల నాని నిష్క్రమణతో మిగ‌తా వాళ్లు ప‌క్క చూపు చూస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Ycp అంతా జంప్..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి కష్టకాలం మొదలైంది అని అర్ధం అవుతుంది. చాలా మంది వైసీపీ నాయ‌కులు ప‌క్క పార్టీకి జంప్ అయ్యేలా క‌నిపిస్తున్నారు. లిస్ట్‌లో భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఉన్నార‌నే టాక్ న‌డుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించి గ‌త ఎన్నిక‌ల‌లోజెయింట్ కిల్లర్ అయిన శ్రీనివాస్‌కి తొలి విడతలోనే కాదు విస్తరణలోనూ చాన్స్ దక్కలేదు. దాంతో గ్రంధి శ్రీనివాస్ అప్పట్లోనే తీవ్ర అసంతృప్తికి లోను అయ్యారని అంటారు. ఈ ఎన్నిక‌ల‌లో మాత్రం ఓట‌మిపాల‌య్యారు. అయితే ఇప్పుడు ఆయ‌న పార్టీ కార్యక్రమాల్లోనూ పాలు పంచుకోవడం లేదు. వైసీపీ అధినాయకత్వం నిర్వహించే సమీక్షా సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడంలేదు. ఆయన కూటమి వైపుగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఇటీవలవ ఏపీలో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో గ్రంధి సోదరులు ముఖ్యమంత్రి చంద్రబాబుని కోటి రూపాయల చెక్కుని అందించి వచ్చారు.

YCP

YCPcp

 

ఈ ప‌రిణామాల‌ని చూసి గ్రంధి కూట‌మి వైపుకి వెళ్ల‌డం ఖాయం అంటున్నారు. ఇక భీమవరంలో చూస్తే ఒకనాడు టీడీపీలో గట్టిగా ఉండే పులపర్తి ఆంజనేయులు జనసేనలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. దాంతో టీడీపీలో స్లాట్ ఖాళీగా ఉంది అని అంటున్నారు గ్రంధి శ్రీనివాస్ వంటి దూకుడు కలిగిన నేత వస్తే బాగానే ఉంటుందని అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో కీలక నేత మాజీ మంత్రి చెరుకూరి శ్రీ రంగనాధరాజు. ఆయన కూడా వైసీపీ మీద అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి తీసేశారు అని కోపం అంటున్నారు. కొన్నాళ్ళ పాటు ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి అప్పగించినా దానిని కూడా తీసెశారు. ఈ మొత్తం పరిణామంతో రాజు గారు కలత చెందారని ఆయన కూడా కూటమి వైపుగా సాగాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది