YCP Janasena : మంచి ఎండల్లో జనసేన, వైసీపీ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్.. రాజకీయంగా ఏం జరగనుంది ?
ప్రధానాంశాలు:
YCP Janasena : మంచి ఎండల్లో జనసేన, వైసీపీ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్.. రాజకీయంగా ఏం జరగనుంది ?
YCP Janasena : ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించడంతో పాటు కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న Pawan Kalyan పవన్ కళ్యాణ్ ఈ సారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని అనుకుంటున్నారు. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజక వర్గంలో ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ నిర్వహించబోతున్నారు. ప్లీనరీ నిర్వహణపై విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది.

YCP Janasena : మంచి ఎండల్లో జనసేన, వైసీపీ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్.. రాజకీయంగా ఏం జరగనుంది ?
YCP Janasena బిగ్ ఫైట్..
గతంలో అధికారంలో లేకపోయినా జనసేన పార్టీ ఆవిర్భావ సభల్ని పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించే వారు. వాటి విషయంలో అప్పటి YCP వైసీపీ ప్రభుత్వంతో సై అంటే సై అనే వారు. అలాగే ఆవిర్భావ సభల్లో పవన్ ప్రసంగాలు కూడా వాడివేడిగా ఉండేవి. అయితే ప్రభుత్వంలోకి వచ్చాక పవన్ దూకుడు తగ్గిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరిగి జనసేన పార్టీ కార్యకర్తలు, తన అభిమానుల్లో జోష్ నింపేందుకు పవన్ ప్లీనరీని వాడుకునే అవకాశముంది.
ఇక మార్చి 12 వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి డీలా పడింది. ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించి మళ్లీ కార్యకర్తలలో జోష్ నింపాలని జగన్ భావిస్తున్నారు.మరి ఒకే రోజు జరగనున్న ఈ రెండు సభలు రాజకీయంగా ఎలా ఉంటాయో చూడాలి.