Gudivada Amarnath : వై.యస్.షర్మిల కాంగ్రెస్ లో చేరినా.. కే.ఏ.పాల్ పార్టీలో చేరిన మాకేం సంబంధం లేదు… వైసీపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gudivada Amarnath : వై.యస్.షర్మిల కాంగ్రెస్ లో చేరినా.. కే.ఏ.పాల్ పార్టీలో చేరిన మాకేం సంబంధం లేదు… వైసీపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్..!!

 Authored By anusha | The Telugu News | Updated on :29 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  వై.యస్.షర్మిల కాంగ్రెస్ లో చేరినా.. కే.ఏ.పాల్ పార్టీలో చేరిన మాకేం సంబంధం లేదు... వైసీపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్..!!

  •  వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన పార్టీలోకి చేరిన వైసీపీ ఎమ్మెల్సీ చిన్న బోయిన వంశీకృష్ణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు

Gudivada Amarnath : వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన పార్టీలోకి చేరిన వైసీపీ ఎమ్మెల్సీ చిన్న బోయిన వంశీకృష్ణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..గుడివాడ అమర్ నాథ్ ను మార్చిన, అమర్ నాథ్ ను ఖాళీగా ఉంచినా, వై.యస్.జగన్మోహన్ రెడ్డి కోసం కృషి చేస్తాం అని అన్నారు. 175 అభ్యర్థుల కోసం, రాష్ట్ర ప్రజలను పణంగా పెట్టలేనని, రాష్ట్ర భవిష్యత్తు, పేదవాడి భవిష్యత్తు ముఖ్యమని, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తప్ప, సీటు ఇవ్వలేదని ఎవరు బాధపడవద్దని, అధికారంలోకి వచ్చాక మంచి చేస్తామని వై.యస్.జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పారని అన్నారు. కేవలం సీట్ల కోసమే పనిచేసేవాళ్లు వైయస్సార్ సీపీ పార్టీలో ఎవరూ లేరని ఆయన అన్నారు. అలాంటివాళ్లు పార్టీలో ఉండకుండా వెళ్ళిపోతేనే మంచిదని అన్నారు. పార్టీలో మార్పులు చేర్పులు జరగటం వలన ఎటువంటి ఇబ్బంది లేదని, అక్కడ పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు వలన ఎటువంటి సమస్య లేదని అన్నారు.

వైయస్సార్ సీపి అధ్యక్షుడిగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసమే ఏ నిర్ణయం తీసుకుంటారో, ప్రజలు కూడా దానిని నమ్ముతారని భావిస్తున్నాం అని అన్నారు. వైయస్సార్ సీపీ పార్టీకి మంచి జరుగుతుందని భావిస్తున్నాను అని అన్నారుష ప్రతిపక్ష పార్టీలు వైయస్సార్ సీపీ పార్టీ ఖాళీ అవుతుందని ఎద్దేవా చేస్తున్నారు. కానీ మేము కొంతమంది అభ్యర్థులను సస్పెండ్ చేశాం. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను సస్పెండ్ చేశాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో బలంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అని, ఒకరిద్దరూ వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం జరగదని, వై.యస్.జగన్మోహన్ రెడ్డి మానసికంగా కృంగిపోయారు అనుకోవడం అమాయకత్వమని గుడివాడ అన్నారు. వైయస్సార్ సీపీ పార్టీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరిని వాడుకొని వదిలి వేయలేదు. ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు అని, కొన్ని వందల రాజకీయ పార్టీలు మనదేశంలో ఉన్నాయి.

ఎవరు ఏ పార్టీలో కైనా వెళ్ళవచ్చు. కే.ఏ.పాల్ పార్టీలో జాయిన్ కావచ్చు, ఇంకా మరేదైనా పార్టీలో చేరవచ్చు. అది వారి హక్కు. ఎవరు ఏ పార్టీలో చేరిన మాకు సంబంధం ఉండదు అని గుడివాడ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల వైయస్సార్ సీపీ ఎమ్మెల్సీ విశాఖపట్నం నాయకుడు చెన్నబోయిన వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలోకి చేరారు. ఈ క్రమంలోనే గుడివాడ అమర్ నాథ్ దానిపై స్పందించినట్లుగా తెలుస్తుంది. ఎవరు ఏ పార్టీలోకి వెళ్లిన వైసీపీ పార్టీకి ఎటువంటి నష్టం జరగదని, పార్టీకి వ్యతిరేకత ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసిన బలమైన పార్టీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ఇలా వైసీపీ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు టీడీపీ, జనసేనలోకి వెళతారో చూడాలి. ఈసారి ఏపీలో వైసీపీ పార్టీకి కూటమిగా ఏర్పడిన జనసేన టీడీపీకి మధ్య గట్టి పోటీ ఏర్పడడంతో ఎవరు గెలుస్తారు అనేదాని పైన చర్చనీయాంశంగా మారిందిష ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరొక పార్టీలోకి వెళుతుండడంతో ఏ పార్టీ గెలుస్తుంది చెప్పడం కష్టంగా మారింది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది