Venu Swamy : మరో 10 ఏళ్ళు జగనే సీఎం… వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : మరో 10 ఏళ్ళు జగనే సీఎం… వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!

 Authored By aruna | The Telugu News | Updated on :29 February 2024,9:30 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : మరో 10 ఏళ్ళు జగనే సీఎం... వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!

Venu Swamy : ప్రస్తుత కాలంలో వేణు స్వామి అంటే తెలియని వారు ఉండరు కాబోలు.ఎందుకంటే వేణు స్వామి అనే వ్యక్తి మొదట తెలుగు సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు.మరీ ముఖ్యంగా నాగచైతన్య మరియు సమంత విషయంలో పెళ్లయిన కొన్ని రోజులకే వారిద్దరు విడాకులు తీసుకుంటారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వేణు స్వామి చెప్పినట్లుగానే సమత నాగచైతన్య పెళ్లయిన రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా వేణు స్వామి చెప్పినవి చాలామందికి జరగడంతో ఒక్కసారిగా ఆయన ఫేమస్ అయ్యారు. దీంతో ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయనేతల భవిష్యత్తులను కూడా సోషల్ మీడియా వేదికగా బయట పెడుతూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా వేణు స్వామి పలు రకాల యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి ఆంధ్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోని ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వై.యస్ జగన్ ఘన విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. అంతేకాదు 2029లో జరిగే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన తెలియజేశారు. ఇక చంద్రబాబు మరియు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో సమూలంగా అంతరించిపోతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ స్థాపించి ఇక్కడ రాజీనామా చేసే ఆంధ్ర రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల కూడా రాజకీయపరంగా పెద్దగా ఎదగలేదని ఈ సందర్భంగా వేణు స్వామి తెలియజేశారు. అదే షర్మిల తన అన్న జగన్ తో పాటు కలిసి ఉంటే ఆమె జీవితం చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు.

అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ మరియు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొడుకు కేటీఆర్ రాజకీయపరంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని వేణు స్వామిని అడిగినప్పుడు వారిద్దరి జాతకాల పరంగా అలాంటివి జరిగే అవకాశాలు చాలా తక్కువ అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి తెలియజేశారు. కేటీఆర్ ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ముఖ్యమంత్రిగా మాత్రం ఆయనకు రాసిపెట్టి లేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఇక నారా లోకేష్ విషయానికొస్తే 2024లో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉండవచ్చు కానీ ముఖ్యమంత్రి వరకు వెళ్లే అవకాశాలు అసలు లేవని ఈ సందర్భంగా వేణు స్వామి తెలియజేశాడు. దీంతో ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది