Ysrcp : ఎన్నిక‌ల త‌ర్వాత ఎంత తేడా.. అస్స‌లు ప‌వ‌న్ ఊసే ఎత్త‌ని వైసీపీ నాయ‌కులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ysrcp : ఎన్నిక‌ల త‌ర్వాత ఎంత తేడా.. అస్స‌లు ప‌వ‌న్ ఊసే ఎత్త‌ని వైసీపీ నాయ‌కులు..!

Ysrcp : ఏపీ ఎన్నిక‌ల స‌మయంలో ప‌వ‌న్, వైసీపీ నాయ‌కులు ఎంత దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకున్నారో మ‌నం చూశాం.ప‌వ‌న్ పెళ్లిళ్ల గురించి జ‌గ‌న్ ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తుంటే, ప‌వ‌న్ మాత్రం జ‌గ‌న్‌ని అధికారంలోకి రానిచ్చేదే లేదు అంటూ ఖ‌రాఖండీగా చెప్పేశాడు. ఇక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ప‌వన్ డిప్యూటీ సీఎం కావ‌డం, జ‌గ‌న్ పార్టీ 11 సీట్ల‌కే ప‌రిమితం కావ‌డం మ‌నం చూశాం. అయితే రాష్ట్రంలో వరద పరిస్థితులపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షించారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 September 2024,4:10 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : ఎన్నిక‌ల త‌ర్వాత ఎంత తేడా.. అస్స‌లు ప‌వ‌న్ ఊసే ఎత్త‌ని వైసీపీ నాయ‌కులు..!

Ysrcp : ఏపీ ఎన్నిక‌ల స‌మయంలో ప‌వ‌న్, వైసీపీ నాయ‌కులు ఎంత దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకున్నారో మ‌నం చూశాం.ప‌వ‌న్ పెళ్లిళ్ల గురించి జ‌గ‌న్ ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తుంటే, ప‌వ‌న్ మాత్రం జ‌గ‌న్‌ని అధికారంలోకి రానిచ్చేదే లేదు అంటూ ఖ‌రాఖండీగా చెప్పేశాడు. ఇక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ప‌వన్ డిప్యూటీ సీఎం కావ‌డం, జ‌గ‌న్ పార్టీ 11 సీట్ల‌కే ప‌రిమితం కావ‌డం మ‌నం చూశాం. అయితే రాష్ట్రంలో వరద పరిస్థితులపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షించారు. బుడమేరు కాలువ 90శాతం ఆక్రమణలో ఉంది. ఆక్రమణల వల్లే బుడమేరు సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. వాగులు వెళ్లే దారిలో ఆక్రమణలు చెయ్యడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని పవన్ కల్యాణ్ అన్నారు.

Ysrcp ఎంత తేడా…

గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ఆక్రమణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం వరదలు ముంచెత్తడంతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సమయంలో వైసీపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు విమర్శలు చేయడం మానుకొని సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ సూచించారు. విపత్తు సమయంలో అందరం కలిసి ప్రజల్ని ఆదుకోవాలి. ముందు వైసీపీ సహాయంచేసి అప్పుడు మాపై విమర్శలు చేయండి. ఇళ్లలో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని వైసీపీ నేతల తీరును పవన్ విమర్శించారు.నేను బయటకి రావడం లేదని వైసీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై నేను ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను. నేను గ్రౌండ్ లోకి వస్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అధికారుల సూచనతో నేను వెనక్కి తగ్గాను అని ప‌వ‌న్ అన్నారు.

Ysrcp ఎన్నిక‌ల త‌ర్వాత ఎంత తేడా అస్స‌లు ప‌వ‌న్ ఊసే ఎత్త‌ని వైసీపీ నాయ‌కులు

Ysrcp : ఎన్నిక‌ల త‌ర్వాత ఎంత తేడా.. అస్స‌లు ప‌వ‌న్ ఊసే ఎత్త‌ని వైసీపీ నాయ‌కులు..!

ఇదొక్క విష‌యంలోనే ప‌వన్, వైసీపీ నాయ‌కుల మ‌ధ్య చిన్నపాటి వార్ న‌డిచింది కాని ఎక్క‌డ కూడా ప‌వ‌న్ గురించి వారు మాట్లాడింది లేదు. పవన్ ఎంతో హుందాగా సంయమనం పాటిస్తూ వస్తున్నారు.ఆయనకు ఈ రాజకీయ కక్షలు ప్రతీకార రాజకీయాలు అన్నవి గిట్టవు అన్న మాటలనే నిజం చేస్తూ ఒక స్పూర్తిగా ఉంటున్నారు. అదే సమయంలో పవన్ ఏమిటో ఆయన రాజకీయం ఏమిటో తెలిసి వచ్చిన వైసీపీ కూడా గత మూడు నెలలుగా ఆయనను ఒక్క మాట అంటే ఒట్టు. పవన్ ఊసు ఎత్తడం లేదు. ఆయన మీద చిన్నపాటి విమర్శ కూడా చేయడంలేదు.టీడీపీని చంద్రబాబునే వైసీపీ టార్గెట్ చేస్తోంది. మరి దీని వెనక ఏమి అర్థాలు ఉన్నాయో తెలియదు కానీ చంద్రబాబునే వైసీపీ చూస్తోంది. ఆయన మీదనే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది. మ‌రి దీని వెన‌క మ‌త‌ల‌బు ఏంటా అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది