YS Jagan : అద్భుతమైన వరం ప్రకటించిన వైఎస్ జగన్ – రాత్రికి రాత్రి భారీగా పెరిగిన ఓటు బ్యాంకు !
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి మొదలైంది. మామూలుగా కాదు. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. ఇక.. అధికార వైసీపీ కూడా ఎన్నికల కోసం రెడీ అవుతోంది. రెండోసారి కూడా గెలవాలి కదా. అందుకే వైఎస్ జగన్ ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఇప్పటికే ఏపీలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం జగన్.. తాజాగా ప్రజలకు మరో వరం ప్రకటించారు.
నిజానికి.. ఏ ఇంట్లో అయినా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, పెన్షనర్ ఉన్నా ఆ కుటుంబంలో వేరే పథకానికి అర్హత లేకుండా చేశారు. దీంతో కొన్ని వర్గాల ప్రజలు ఏపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. అందుకే అటువంటి వాళ్ల ఓటు బ్యాంకు కూడా పొందడం కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. అదే.. జగనన్న సురక్షలో భాగంగా ప్రతి కుటుంబానికి రెండో పెన్షన్ ఇచ్చేందుకు జగన్ సర్కార్ ఆలోచిస్తోంది.ఇప్పటికే సామాజిక పెన్షన్ పొందే వాళ్లు అంటే వృద్ధాప్య పింఛన్, వితంతువు పింఛన్, వికలాంగ పింఛన్ పొందే ఇంట్లో కూడా రెండో పెన్షన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అంటే ఒక పెన్షన్ ఉన్నా ఆ కుటుంబంలో మరో పెన్షన్ కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది.
YS Jagan : ఎవరు రెండో పెన్షన్ కు అర్హులు
నిజానికి సామాజిక పెన్షన్లకే ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. ఈనేపథ్యంలో సెకండ్ పెన్షన్ కూడా ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. భారీగా నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. మరి.. అందరినీ అక్కున చేర్చుకోవాలంటే రెండో పెన్షన్ కూడా ఇవ్వాలంటే ఏపీ ఖజానా భారీగా ఖాళీ అవుతుంది. కానీ.. వైసీపీకి మాత్రం రాజకీయంగా మేలు జరుగుతుంది. చూద్దాం మరి.. సెకండ్ పెన్షన్ సీఎం జగన్ కు ఎలాంటి ప్రయోజనాలను తీసుకొస్తుందో?