YS Jagan : ప్రచారాలలో ట్రాక్ మార్చిన వైయస్ జగన్…ఓటర్లను ఆకర్షించే దిశగా అడుగులు…!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS Jagan : ప్రచారాలలో ట్రాక్ మార్చిన వైయస్ జగన్…ఓటర్లను ఆకర్షించే దిశగా అడుగులు…!!

YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు మరో ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల ప్రచారానికి 6 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఈ గోల్డెన్ టైమ్ ని జాగ్రత్తగా వాడుకునేందుకు రాజకీయ నేతలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగంలో పదును పెంచినట్లుగా తెలుస్తుంది. అయితే వాస్తవానికి జగన్ ప్రసంగాలు గతంలో చాలా రొటీన్ గా ఉండేవి కానీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 May 2024,6:58 pm

YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు మరో ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల ప్రచారానికి 6 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఈ గోల్డెన్ టైమ్ ని జాగ్రత్తగా వాడుకునేందుకు రాజకీయ నేతలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగంలో పదును పెంచినట్లుగా తెలుస్తుంది. అయితే వాస్తవానికి జగన్ ప్రసంగాలు గతంలో చాలా రొటీన్ గా ఉండేవి కానీ ఇటీవల చూస్తే దూకుడు పెరిగినట్లుగా కనిపిస్తోంది. అంతేకాక ఇంట్రెస్టింగ్ మేటర్ ను సబ్జెక్ట్ గా చేసుకొని ప్రజలకు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జగన్ ప్రారంభించిన సిద్ధం సభలనుండి బస్సు యాత్ర దాకా ఒకే ఒక్క అంశంపై మాట్లాడుతూ వచ్చారు. అవే సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు కావాలంటే మాకు ఓటు వేయండి అంటూ మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ చెప్పుకొచ్చారు. అయితే వాస్తవానికి ఈ డైలాగ్ మొదటలో డేరింగ్ అండ్ డాషింగ్ గా అనిపించింది.

పథకాలు అందని వారి పరిస్థితి…

అయితే ప్రచారాలలో జగన్ ఈ విధంగా చెప్పుకొస్తున్నప్పటికీ పథకాలు అందని వారు మాత్రం మాకు మంచి జరగలేదంటూ చెప్పటం మొదలుపెట్టారు. అంతేకాక సంక్షేమ పథకాలు అందిన వారు కూడా జగన్ కు ఓటు వేస్తారా అంటే ,చంద్రబాబు కూటమి అందిస్తున్న రెట్టింపు హామీల వలలో పడే అవకాశం కనిపిస్తుంది.

విపక్షాల విమర్శలు..

ఇలాంటి క్రమంలోనే విపక్ష పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్ బటన్ నొక్కుడు తప్ప చేసేదేం లేదంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పుకొస్తున్నారు. దీంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చేసిన సర్వేలలో ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని వెళ్లడైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ప్రచారాలలో సంక్షేపం పథకాలను పట్టుకుని వేలాడితే దెబ్బతినే అవకాశం ఉందని జగన్ భావించినట్లుగా తెలుస్తుంది.

ట్రాక్ మార్చిన జగన్…

దీంతో ఇప్పటివరకు పథకాలపై ఫోకస్ చేసిన జగన్ తాజాగా ఏపీ అభివృద్ధి గత ఐదేళ్లలో ఏం జరిగిందనేది కూడా పూసగుచ్చినట్లు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో జరిగిన ప్రచారాలలో దాదాపు జగన్ గంటసేపు ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు ఆసుపత్రులు అభివృద్ధి చేశామని , నాణ్యమైన విద్య వైద్యాన్ని అందిస్తున్నామని జగన్ తెలియజేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో సూపర్ స్పెషల్ హాస్పిటల్ నిర్మించామని ,అలాగే ఉద్దానికి వంశధార ద్వారా ఎత్తిపోతల పథకంతో దాదాపు 1000 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి తాగునీటి సదుపాయం అందించినట్లుగా తెలియజేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 15 మెడికల్ కాలేజీలు , 4 పోర్ట్స్ , భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ,ఫిషింగ్ హార్బర్లు ఇలా ఎన్నో నిర్మాణాలు చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30 వేల కోట్ల పెట్టుబడులు వస్తే తమ పాలనలో దాదాపు లక్ష కోట్లు వచ్చాయని ఈ సందర్భంగా జగన్ వివరించారు. ఈ విధంగా జగన్ ట్రాక్ మార్చి ప్రచారాలు చేస్తుండడంతో ప్రజలు కూడా ఈ కార్యక్రమాలపై ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్ చేపట్టిన ఈ అభివృద్ధికి జనాల సంతృప్తి చెందుతారా లేదా అనేది వేచి చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది