Vijayasai Reddy : జగన్ సరికొత్త నిర్ణయం.. విశాఖ విజయసాయిరెడ్డికే..!
ప్రధానాంశాలు:
vijayasai reddy : జగన్ సరికొత్త నిర్ణయం.. విశాఖ విజయసాయిరెడ్డికే..!
vijayasai reddy : ఏపీలో వైసీపీ దారుణమైన ఓటమి చవి చూశాక జగన్ సరికొత్త ఎత్తులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఇప్పుడు విశాఖ సహా ఉత్తరాంధ్ర బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు అయిన వి విజయసాయిరెడ్డికి అప్పగించాలని జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు టాక్ నడుస్తుంది. 2016 నుంచి 2022 దాకా ఆరేళ్ల పాటు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలు చూడగా, ఆయన హయాంలో అంటే 2019లో వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఘన విజయం సాధించింది. ఆయన తరువాత వచ్చిన వైవీ సుబ్బారెడ్డి విశాఖ సహా ఉత్తరాంధ్ర బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేక పోగా చాలా విమర్శలని మూటగట్టుకున్నారు.
vijayasai reddy జగన్ నిర్ణయం ఫైనల్..
అయితే విజయసాయిరెడ్డిని గతంలో వైసీపీలో వ్యతిరేకించిన వారే ఇపుడు కూడా వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా శాసనమండలిలో వైసీపీ పక్ష నాయకుడు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విజయసాయిరెడ్డిని రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఎవరు వ్యతిరేఖించిన కూడా జగన్ తన నిర్ణయమే ఫైనల్ అని అంటున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకాన్ని ప్రారంభించారు అని అంటున్నారు. విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర పట్లు అన్నీ తెలుసు అని ఆయన మళ్ళీ వైసీపీకి పూర్వ వైభవం తీసుకుని వస్తారని జగన్ బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తుండగా, ఆయనని ఫైనల్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే బొత్సకు కీలక పదవి కట్టబెట్టినా పార్టీకి అయితే జోష్ రావడం లేదు. వెళ్లే వారు వెళ్ళిపోతున్నారు. వారిని సర్దిచెప్పి ఉంచే ప్రయత్నం జరగడం లేదు అని అధినాయకత్వం భావిస్తోంది. అలాగే పార్టీలో సీనియర్లు సైలెంట్ గా ఉన్నారు.అందుకే జగన్ మరోసారి విజయసాయి రెడ్డినే నమ్ముతున్నాడు. మరి ఆయన ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.విజయ సాయి రెడ్డి గత కొన్నాళ్లుగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ పాలనతో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఎందుకు ఉన్నారో చెప్పాలని నిలదీశారు. మెనిఫెస్టో లో ఇచ్చిన హామీల అమలులో ఎందుకు పూర్తి వైఫల్యం చెందిందని ప్రశ్నించారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీగా స్వయంగా ప్రకటించుకునే చంద్ర బాబు ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల్లో కులప్రాతిపదికనే జరిగాయన్న విమర్శలు ఎందుకు వచ్చాయని, ఆరంభమే ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకొచ్చిందని పేర్కొన్నారు.