YS Jagan : వైయస్ షర్మిల కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వై.యస్. జగన్మోహన్ రెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : వైయస్ షర్మిల కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వై.యస్. జగన్మోహన్ రెడ్డి..!

 Authored By aruna | The Telugu News | Updated on :24 January 2024,7:00 pm

YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు హోరాహోరీ పోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక తాజాగా వైఎస్సార్ సీపీ అధినేత సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అనంతపురం ఉరవకొండలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు. జగన్ మాట్లాడుతూ ప్రజలకు ఏ మంచి చేయని వారికి ప్రజలను మోసం చేసేవారికి ఎంతోమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని డైరెక్ట్ గా చంద్రబాబును జగన్ అన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరని అయితే మీ బిడ్డ వాళ్ళెవరిని నమ్ముకోలేదని, వీళ్ళందరి కంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెనర్లు ఉన్నారని గట్టిగా చెబుతున్నానని, మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కచెల్లెమ్మలే స్టార్ క్యాంపెనర్లు అని వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ లో మంగళవారం ఆయన వైయస్సార్ ఆసరా పథకం కింద నాలుగో విడత నిధులు విడుదల సభలో మాట్లాడారు. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా అని అన్నారు. వారందరికీ భిన్నంగా తనకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలో ఎవరికి ఉండరు అని అన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని కోరారు. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలవాలన్నారు. మనం వేసే ఓటు నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నామో మనసులో పెట్టుకోవాలని చెప్పారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకోవడం కాదు పేద కుటుంబాలు పేదరికం నుంచి బయటపడేందుకనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు

ఇక వై.యస్.షర్మిలపై కూడా జగన్ విరుచుకుపడ్డారు. ఆమెను చంద్రబాబు క్యాంపెయినర్ అంటూ చెణుకులు విసిరారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంటూ చురకలు అంటించారు. ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు కూడా చంద్రబాబుకు తోడుగా ఉన్నారని, బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న పసుపు కమలాలు ఇంకొంతమంది స్టార్ కాంపెయినర్ గా ఉన్నారు. అమరావతిలో చంద్రబాబు భూములకు బినామీలు ఉన్నట్లు, మనుషుల్లో ఇతర పార్టీలో రకరకాల రూపాలలో బినామీలుగా చంద్రబాబుకు స్టార్ కాంపైనర్లు ఉన్నారని అన్నారు. టీవీలో విశేషకుల పేరుతో కనిపిస్తారు. మేధావుల పేరుతో వేదికల్లో కనిపిస్తారు. వీళ్లంతా బాబు కోసం పనిచేస్తారు. కారణం దోచుకోవడం పంచుకోవడంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములే కాబట్టి అని సీఎం జగన్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది