Ys Jagan : జగన్ తన కంటిని తానే పొడుచుకుంటున్నాడా.. ఆ విషయంలో వైసీపీ అలా ఎలా బోల్తా పడింది..!
ప్రధానాంశాలు:
Property Rules : భూమి, ఆస్తి ఉన్న వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రాపర్టీ రూల్స్ ఇవే..!
Ys Jagan : ప్రస్తుతం జగన్ వ్యవహారం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయనపై షర్మిళ కొన్నాళ్లుగా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తుంది. తన రాజకీయ జీవితంపై అసూయ, ఈర్ష్యతోనే జగన్ ఉన్నారని చెప్పకనే చెప్పారు. జగన్ ఆస్తి పంపకాలను అడ్డుపెట్టుకొని వైఎస్ షర్మిలని రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించినట్లుగా షర్మిల లెటర్ ద్వారా చెప్పడం జరిగింది. ఇదే సమయంలో వైసీపీ ఎక్స్ ద్వారా ఆసక్తికర ట్వీట్ చేసింది. “వారసత్వపు ఆస్తులు కానప్పటికీ.. స్వార్జితం అయినప్పటికీ.. తన చెల్లెలి మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఇస్తానని కమిట్మెంట్ చూపించి ఎంవోయూ రాసిచ్చారు జగన్.. ఇదే సమయంలో.. కేసులు తేలిన తర్వాత ఆస్తులు అప్పగిస్తారు.
Ys Jagan జగన్ చుట్టూ సమస్యలు..
కానీ.. ఈ లోపే చట్టవిరుద్ధంగా సరస్వతీ పవర్ లో జగన్ ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను ఆధారంగా చేసుకుని విజయమ్మ దగ్గర నుంచి షేర్లను బదిలీ చేయించుకున్నారు”. “ఈ వ్యవహారం లీగల్ గా జగన్ కి ఇబ్బందులు తెచ్చే విషయమని న్యాయవాదులు చెప్పాడంతో.. గత్యంతర లేని పరిస్థితుల్లో లీగల్ స్టెప్ తీసుకున్నారు” అని వైసీపీ రాసుకొచ్చింది. అసలు చెల్లెలిపై ప్రేమ చూపకూడదని అనుకుంటే.. జగన్ ఎంవోయూ రాసిచ్చేవారే కాదు కదా? అనేది వైసీపీ వేస్తోన్న ప్రశ్న!అయితే ఇదే సమయంలో తనను బెదిరిస్తున్నారని షర్మిళ లేఖ తీసుకుని కోర్టుకు వెళ్తే మరో కొత్త సమస్య వచ్చే ఇబ్బంది లేదంటారా? అనేది జగన్ ఫ్యాన్స్ వేస్తోన్న మరో ప్రశ్న.
అన్ని విషయాలలో పూర్తిగా ఆలోచిస్తే మంచిది. అత్యుత్సాహంతో స్పందిస్తే.. జగన్ కు సరికొత్త సమస్యలు తెచ్చిపెట్టినట్లవుతుందనే విషయం మరిచిపోకూడదని ఆయన అభిమానులు అంటున్నారు. జగన్ బెయిల్ రద్దుకు షర్మిల ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ చేస్తోన్న ఆరోపణల సంగతి అలా ఉంచితే… ఈ విషయంలో జగన్ తన వేలుతో తానే తన కంటినే పొడుచుకునేటంత స్థాయిలో తప్పు చేశాడని అంటున్నారు. లీగల్ సమస్యలు ఉన్న ఆస్తులపై జగన్ కమిట్మెంట్లూ, ఒప్పందాలు, ఎలా చేస్తారనేది మరో ప్రశ్న అని అంటున్నారు. ఇక షర్మిళ తనకు అనుకూలంగా ఉంటేనే ఆస్తులు ఇస్తాను అని అనడం కూడా పరోక్షంగా బెదిరింపుల కిందే లెక్క అని.. దీనిపై షర్మిళ లీగల్ యాక్షన్ కు దిగితే అది మరో రచ్చ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.