Property Rules : భూమి, ఆస్తి ఉన్న వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రాపర్టీ రూల్స్ ఇవే..!
Property Rules : ఈమధ్య ఎక్కువగా భూ మోసాలు జరుగుతున్నాయి. వాటి వల్ల చాలా కేసులు అవుతున్నాయి. ఆస్తిని కొనుగోలు చేయడం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితి అయ్యింది. నకిలీ ఆస్తి పత్రాలు, అనధికార విక్రయాల వల్ల కొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ఇలాంటి మోసాలు జరగకుండా ఈ నష్టాలను ఆపేయాలని కొత్తగ ప్రాపర్టీ రూల్స్ ని తీసుకొచ్చారు. మిమ్మల్ని మీరు మీకు తెలిసిన వారిని ఈ మోసం నుంచి కాపడటానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రజలు పెట్టే అత్యంత విలువైన ఆస్తుల్లో భూమి ఒకటి కాగా అందులో మోసాల వల్ల నష్టపోతున్న వారు ఉన్నారు. ఐతే భూమి విలువ పెరుగుతుందని ఎలాంటి ముందుచూపు లేకుండా కొనడం చేస్తే అందుకు తగిన నష్టం జరిగే అవకాశం ఉంది. చాలామంది నకిలీ పత్రాలు ఏర్పాటు చేసి అనధికార విక్రయాలు చేస్తున్నారు. ఒక ఫ్లాట్ కాగితాలు చాలా మంది దగ్గర ఉంటున్నాయి. ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అన్నది గుర్తించడం కుదరట్లేదు.
Property Rules : ఈ పత్రాలను జాగ్రత్తగా
అందుకే ప్రాపర్టీ రూల్స్ ప్రకారం ఈ పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మోసాలను తగ్గించాలని ప్రభుత్వ భావిస్తుంది. రెవెన్యూ శాఖ ఇంకా స్థానిక ఆర్యాలయాలు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాయి. ఇక ప్రాపర్టీ రూల్స్ విషయానికి వస్తే.. పత్రాలను ధృవీకరించాలి.. అంటే న్యాయనిపుణుల దగ్గర తనిఖీ చేయించాలి.
డిజిటైజ్ రికార్డ్స్.. వాటికి సంబందించిన డిజిటలైజ్ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి. ఇక భూమి ఆస్త్రి పత్రలకు ఆధార్ లింక్ చేయడం వారా అనధికార విక్రయాలు, వివాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తల వల్ల ప్రభుత్వ విధానాలతో ఆసి కొనుగోలు లేదా అమ్మకం యజమానులు తమ ఇన్వెస్ట్ మెంట్ ను రక్షించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆస్తి కొన్నా అమ్ముతున్నా కేవలం ఒకరిద్దరు అన్నట్టే కాకుండా తెలిసిన బంధుమిత్రుల సమక్షంలో జరిగితే ఎలాంటి తప్పు జరిగే అవకాశం ఉండదు.