Ys Jagan : గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ వ్యూహాత్మక నిర్ణయం… పవన్ ఓట్లను టార్గెట్ చేస్తూ….!
Ys Jagan : 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి పదవిని పొందాలంటే జగన్మోహన్ రెడ్డికి అనేక రకాల భారీ ఎత్తుగడలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనవైపు నిలబడుతున్నారు అని ఆయన కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నప్పటికీ ఎక్కడో చిన్న భయం ఉన్నట్లు కనిపిస్తోంది. అంత కాన్ఫిడెంట్ గా ఉంటే సర్వేలు చేపించి మరి ఓడిపోతారు అని తెలిసిన ఎమ్మెల్యేలను మార్చుకోవడం ఎందుకు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా 175 స్థానాలకు 175 కొట్టే దమ్ము ఉంటే […]
ప్రధానాంశాలు:
Ys Jagan : గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ వ్యూహాత్మక నిర్ణయం... పవన్ ఓట్లను టార్గెట్ చేస్తూ....!
Ys Jagan : 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి పదవిని పొందాలంటే జగన్మోహన్ రెడ్డికి అనేక రకాల భారీ ఎత్తుగడలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనవైపు నిలబడుతున్నారు అని ఆయన కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నప్పటికీ ఎక్కడో చిన్న భయం ఉన్నట్లు కనిపిస్తోంది. అంత కాన్ఫిడెంట్ గా ఉంటే సర్వేలు చేపించి మరి ఓడిపోతారు అని తెలిసిన ఎమ్మెల్యేలను మార్చుకోవడం ఎందుకు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా 175 స్థానాలకు 175 కొట్టే దమ్ము ఉంటే 89 తెచ్చుకున్న సరిపోతుంది . అయిన కానీ వైఎస్ జగన్ ప్లేసులు మారుస్తున్నాడు అంటే కచ్చితంగా జగన్ ను ఏదో ఒక భయం ఇబ్బంది పెడుతుంది అని చెప్పాలి. సహజంగానే అధికారంలో ఉన్నవారికి యాంటి ఇన్కన్యెన్సీ ఉంటుంది. చంద్రబాబు నాయుడుని మళ్లీ గెలిపించుకోవాలనే ఆలోచన ప్రజలకు మళ్ళీ వచ్చి ఉండవచ్చు. ఇక ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కి సంబంధించి గోదావరి ప్రాంతంలో రాబోయేటటువంటి ఒక సామాజిక వర్గం ఓట్లు అన్ని డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ కి పడబోతున్నాయి.
ఎందుకంటే గతంలో ఏడు శాంతం ఉన్న పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకు ఈసారి 15% పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఏమాత్రం తగ్గకుండా గోదావరి జిల్లాలో ఆపరేషన్ గోదావరి అనేటువంటి కొత్త కాన్సెప్ట్ ని తీసుకువచ్చారని చెప్పాలి. గోదావరి జిల్లాలో మెజారిటీ ఓటు సాధించాలని పవన్ కళ్యాణ్ , చంద్రబాబు యొక్క వ్యూహం. నిజానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యొక్క సామాజిక వర్గం ఓట్లు పడతాయనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ను వెనక పెట్టుకుని తిరుగుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ కూడా మొదటి నుండి గోదావరి జిల్లాలో పైనే ఉంది. టిడిపికి స్థానికంగా ఉన్న బలం పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి సామాజిక వర్గాల మద్దతుతో ఇవన్నీ చూసుకుని రెండు పార్టీలు కూటమిగా ఏర్పడి అత్యధిక సీట్లు ఈ ప్రాంతాలలోనే సాధించాలని ఆలోచనలో ఉన్నారు. ఇక ఇక్కడ మెజారిటీ సీట్స్ కనుక లభిస్తే రాష్ట్రవ్యాప్తంగా గెలుపు తథ్యం అవుతుంది అనేది వారి ఆలోచన. అయితే ఇక్కడ జగన్ తన స్టేటస్లను అప్లై చేస్తున్నారు. కాపు సామాజిక వర్గాలతో పాటు బీసీ అస్త్రాలను కూడా జగన్ ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీలకు ఇక్కడ ఎక్కువగా సీట్లను కేటాయిస్తున్నారు.
రెండు జిల్లాల్లోని సామాజిక సమీకరణాలు అక్కడి పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాలను జగన్ అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే రాజమండ్రి , ఏలూరు ఎంపీ సీట్లను బీసీలకు ఖరారు చేసాడు. ఇక అమలాపురం రిజర్వ్ స్థానం కింద మారుస్తున్నాడు. కాకినాడ ఎంపీ సీట్లును కాపులకి నరసాపురం సీట్లను క్షత్రియులకు ఇవ్వాలని భావిస్తున్నారు.ఇక అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా ఇదే పాలసీని అమలు చేస్తున్నారు . టిడిపి జనసేన సీట్ల సర్దుబాటులో స్థానికంగా సమస్యలు వస్తున్న తరుణంలో జగన్ అలర్ట్ అయ్యారు. ఇక దీనిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే జగన్ ఏలూరు కేంద్రంగా ఫిబ్రవరి 3న సిద్ధం సభకు హాజరుకానున్నట్లు సమాచారం.