YS Sharmila : సాక్షిలో నాకు వాటా ఉంది.. బయటపడ్డ అన్నా – చెల్లి ఆస్తి గొడవలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : సాక్షిలో నాకు వాటా ఉంది.. బయటపడ్డ అన్నా – చెల్లి ఆస్తి గొడవలు..!

 Authored By aruna | The Telugu News | Updated on :30 January 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Sharmila : సాక్షిలో నాకు వాటా ఉంది.. బయటపడ్డ అన్నా - చెల్లి ఆస్తి గొడవలు..!

YS Sharmila : ఏపీ రాజకీయాలలో వైయస్ షర్మిల కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి సెన్సేషనల్ గా మారారు. ఆమె మొదటి రోజు నుంచి తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా కడప జయ గార్డెన్స్ లో ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి హాజరైన వైయస్ షర్మిల మరోసారి తన అన్న వైయస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ.. తన తండ్రి పాలనకు, ఇప్పుడున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. వైసీపీని అధికారంలో తేవటానికి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, జగనన్న కోసం అంత గొప్ప త్యాగం చేస్తే తనపైన ముకుమ్మడిగా దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకొక జోకర్ గాడు బయటికి వచ్చి తనపై వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారని, రోజుకు ఒక కథ పుట్టించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు.

ప్రణబ్ ముఖర్జీతో నా భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడుతున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైయస్ జగన్ జైల్లో పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అనిల్ కోరినట్లు విష ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధం అని వైయస్ షర్మిల చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ వద్దకు అనిల్ భారతీ రెడ్డితో కలిసే వెళ్లారని గుర్తు చేశారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. పదవీ కాంక్ష ఉంటే నాన్న సీఎం గా ఉన్నప్పుడే తీసుకునే వాళ్ళం కదా అని వైయస్ షర్మిల ప్రశ్నించారు. జగనన్న కోసం పాదయాత్ర చేసినప్పుడు కూడా నేను పదవి అడగలేదని వైసీపీ వారికి దమ్ముంటే అది నిరూపించండి అని సవాల్ విసిరారు. ఇక సాక్షి పత్రికలు నాపైన వ్యక్తిగతంగా వార్తలు రాస్తున్నారు అని, ఆ పత్రికలో జగనన్నకు ఎంత భాగస్వామ్యం ఉందో నాకు అంతే భాగస్వామ్యం ఉందని వైయస్ షర్మిల స్పష్టం చేశారు.

ఈ విషయం మరిచి సాక్షి పత్రిక ఇష్టం వచ్చినట్లు తనపై వార్తలు రాస్తుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఏం చేసినా, ఏం రాసినా భయపడే ప్రసక్తే లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఒక కలలా మిగిలిపోయిందని వైయస్సార్ బ్రతికి ఉంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేది అని, అంతేకాకుండా కడప జిల్లాకు ఆయన ఇంకా ఎంతో చేసేవారని వైయస్ షర్మిల అన్నారు. జగనన్న కడప జిల్లా వాసిగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయలేకపోయారని, కడప బెంగుళూరు రైల్వే నిర్మాణం ఆగిపోయేలా చేశారని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను ఇప్పటివరకు ఆదుకోలేదని అన్నారు. ఇంకా జగనన్నకు కడప జిల్లా పై ప్రేమ ఉందని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. బీజేపీకి వైసీపీ బానిసై అన్ని విషయాలలో మద్దతు ఇస్తుందని అన్నారు. దీంతో వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు సాక్షి పత్రికలో ఆమెకు తన అన్న వైయస్ జగన్ కు భాగస్వామ్యం ఉందని చెప్పడంతో ఇద్దరి మధ్య ఉన్న ఆస్తి గొడవలు బయటపడ్డాయి అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది