YS sharmila : సాక్షిపై హక్కు కోసం బరిలో దిగిన షర్మిల… సుప్రీంకోర్టులో జగన్ పై కేసు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS sharmila : సాక్షిపై హక్కు కోసం బరిలో దిగిన షర్మిల… సుప్రీంకోర్టులో జగన్ పై కేసు…!

YS sharmila : తెలంగాణ ఎన్నికల్లో పాటిస్పేట్ చేసి పార్టీ పెట్టి తన వంతుగా పాదయాత్ర చేసి గెలుపు కోసం కష్టపడి , ఆఖరికి వెనకడుగు వేసి డ్రాప్ అయిన వైయస్ షర్మిల అప్పట్లో అక్కడ చేసినటువంటి పాదయాత్రలో కానీ, అక్కడ తిరిగిన అటువంటి ప్రజానికం లో గాని , ఏ రోజు కూడా ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదా తన అన్నకి తనకి సగం సగం భాగం ఉన్నటువంటి సాక్షి పత్రిక […]

 Authored By aruna | The Telugu News | Updated on :2 February 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  YS sharmila : సాక్షిపై హక్కు కోసం బరిలో దిగిన షర్మిల... సుప్రీంకోర్టులో జగన్ పై కేసు...!

YS sharmila : తెలంగాణ ఎన్నికల్లో పాటిస్పేట్ చేసి పార్టీ పెట్టి తన వంతుగా పాదయాత్ర చేసి గెలుపు కోసం కష్టపడి , ఆఖరికి వెనకడుగు వేసి డ్రాప్ అయిన వైయస్ షర్మిల అప్పట్లో అక్కడ చేసినటువంటి పాదయాత్రలో కానీ, అక్కడ తిరిగిన అటువంటి ప్రజానికం లో గాని , ఏ రోజు కూడా ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదా తన అన్నకి తనకి సగం సగం భాగం ఉన్నటువంటి సాక్షి పత్రిక గురించి మీడియా ఛానల్ గురించి ఏ రోజు ఆమె మెన్షన్ చేయలేదు. తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తులలో సమాన హక్కు తనకి ఉంది. కానీ సాక్షి పత్రిక మీడియా ఛానల్ ఏ రోజు తెలంగాణలో జరుగుతున్న తన పాదయాత్రకు కవరేజ్ ఇవ్వలేదు అని ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈరోజు ఆమె ఆంధ్రప్రదేశ్ లో తనకి వ్యతిరేకంగా తనకు 50% వాటా ఉన్న సాక్షితో తిట్టిస్తున్నారని , విష ప్రచారం తనమీద తన సాక్షిలోనే చేస్తున్నారని తన సొంత పత్రికలోనే విష ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడుతున్నారు. నిజానికి అప్పట్లో ఒకసారి మనం గమనిస్తే పాదయాత్ర చేస్తున్న సమయంలో కాని కావచ్చు ,ఆమె పార్టీ పెట్టిన మొదట్లో గాని కావచ్చు ,ఆ తరువాత పార్టీ ని వెన్నకి తీసుకున్నప్పుడు కావచ్చు కేవలం ఒకే ఒక స్టేట్మెంట్ మాత్రం సాక్షి న్యూస్ ఛానల్ లో వేసేవారు. అది కూడా చాలా సింపుల్ గా షర్మిల అలా అన్నారు అంతే ఓవర్… ఈ రోజు షర్మిల ఇక్కడ పాద యాత్ర చేశారు ఓవర్.

అయితే ఇక్కడ అసలు జనాల స్పందన గాని ,కాంట్రవర్సీస్ ,ఎఫెక్ట్స్ కాని ఆమె తీసుకోబోయే నిర్ణయాలు గాని , ఆమె గెలిస్తే ఎం చేసిది అని చెప్తున్నారు అని కానీ ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే ఉద్దేశం గురించి కానీ ఎక్కడ చెప్పలేదు.అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆమె అడుగు పెట్టిన తర్వాత మాత్రం ఆ పార్టీ ఆవిర్భావ గురించి కూడా ఎక్కడా రాయకుండా ఆమె పార్టీ పెట్టారు అని కూడా ఎక్కడ ప్రస్తావించకుండా రీసెంట్ గా కొండారెడ్డి వంటి వ్యక్తులను తీసుకువచ్చి తన మీద తన వ్యక్తిత్వాన్ని హేళన చేస్తూ , ఆ వ్యక్తి వైఎస్సార్ పార్టీకి చెందిన వ్యక్తి అంటూ… ఆయన ధ్వారా ఆమె మీద బురద చల్లే ప్రయత్నం చేయడం తోనే వైయస్ షర్మిల సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె లీగల్ గా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిజానికి సాక్షి మొత్తం వైఎస్ భారతి చేతిలో ఉన్నట్లు చెప్తున్నారు. కానీ రానున్న రోజుల్లో తనకి సంబంధించిన వాటా కోసం లీగల్ పోరాటానికి వైయస్ షర్మిల దిగబోతున్నట్లు తెలుస్తుంది. వన్స్ షర్మిల రాజకీయ అంశాలను సీరియస్ గా తీసుకొని లీగల్ గా తీసుకుంటే తన 50% వాటా కోసం తన వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ లాయర్లను ఉపయోగించి ఆమె సుప్రీం కోర్టు లో అన్న జగన్ పై అలాపై వదిన వైయస్ భారతి పై సాక్షి కోసం పోరాటాన్ని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే 2029 ఎలక్షన్స్ కల్లా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ షర్మిల కి మీడియా అనేది అత్యంత ముఖ్యం.

ఎందుకంటే ఒక్కసారి ఆమె టిడిపి పార్టీ వాళ్ళనే తిట్టడం మొదలు పెడితే , వాళ్ల మీద సీరియస్ అవ్వడం మొదలు పెడితే టిడిపి సపోర్ట్ గా నిలబడిన మీడియా కూడా ఈమెను కవర్ చేయడం మానేస్తుంది. ఉదాహరణకి ఆమె కొన్ని సందర్భాలలో జగన్ తప్పు చంద్రబాబు నాయుడు తప్పు అని విపరీతంగా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరు మనల్ని మోసం చేశారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2023 వరకు మనల్ని మోసం చేశారు అని ఆమె స్పష్టంగా చెప్పిన కుడా ఈనాడు , ఏబీఎన్ కేవలం జగన్ని మాత్రమే తిట్టినట్లుగా వీడియోలను వైరల్ చేస్తున్నాయి కానీ , చంద్రబాబును తిట్టినట్లుగా ఎక్కడ వీడియోలు చూపించడం లేదు. అందుకే 2029 కళ్ళ ప్రత్యామ్నాయ శక్తిగా ఆమె ఎదగాలంటే , కచ్చితంగా ఆమెకి సాక్షిలో 50% వాటా కావాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. లేదా సాక్షిలో తనకు సంబంధించిన వారిని పెట్టుకుని కనీసం రోజులు కొన్ని వార్తలను ఆమె గురించి కవర్ చేసేలా చూసేందుకు ఆలోచనలో ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది