YS Sharmila : సొంత చెల్లెలిని అని చూడకుండా నన్ను అరెస్టు చేయించాడు.. వైయస్ జగన్ పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన వైయస్ షర్మిల..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : సొంత చెల్లెలిని అని చూడకుండా నన్ను అరెస్టు చేయించాడు.. వైయస్ జగన్ పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన వైయస్ షర్మిల..!

YS Sharmila  : ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ స్థానంలో 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల తో పాటు కాంగ్రెస్ నేతలను నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. వారు తప్పించుకొని ఉండవల్లి వరకు వెళ్లారు. దీంతో పోలీసులు వైయస్ షర్మిల తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలని అరెస్టు చేసి […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 February 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Sharmila : సొంత చెల్లెలిని అని చూడకుండా నన్ను అరెస్టు చేయించాడు.. వైయస్ జగన్ పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన వైయస్ షర్మిల..!

YS Sharmila  : ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ స్థానంలో 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల తో పాటు కాంగ్రెస్ నేతలను నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. వారు తప్పించుకొని ఉండవల్లి వరకు వెళ్లారు. దీంతో పోలీసులు వైయస్ షర్మిల తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైయస్ షర్మిలను ఏపీ పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించడంపై కాంగ్రెస్ నేతలు సీరియస్ అయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ జాతీయ నేతలైన కేసి వేణుగోపాల్ ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ వంటి వారు వైయస్ షర్మిల అరెస్టును ఖండిస్తూ ట్వీట్లు పెట్టారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి షర్మిలను చూస్తే అంత భయం ఎందుకని వారు ప్రశ్నించారు.

దీంతో జాతీయస్థాయిలో వైయస్ షర్మిల అరెస్టు వ్యవహారం చర్చనీయాంశం అయింది. ఇక వైయస్ షర్మిల కూడా తన అరెస్టుపై స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన అరెస్టు ఘటనపై అమ్మ బాధపడుతున్నారు అని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైయస్సార్ బిడ్డ పోరాటం చేసేది నిరుద్యోగుల కోసమే అని అన్నారు. సచివాలయంలో వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ కూడా తమకు లేదా అని ప్రశ్నించారు. సెక్రటేరియట్ కు సీఎం రాడని, మంత్రులు లేరని, అధికారులు రారని వైయస్ షర్మిల విమర్శించారు. ఒక ఆడ బిడ్డని కూడా చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టు చేయాలని చూస్తారా? వేలాదిగా తరలివస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా

నేను ఒక మహిళనై ఉండి హౌస్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు పోలీసులను తప్పించుకుని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాత్రి గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా అని అన్నారు. మమ్మల్ని ఆపాలని చూసిన ఎక్కడికి అక్కడ మా కార్యకర్తలను నిలువరించిన బారికెడ్లతో బంధించాలని చూసిన నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదని వైయస్ షర్మిల అన్నారు. వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీ దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టు చేస్తున్నారు. మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు. ఇనుపకంచెలు వేసి మమ్మల్ని ఇబ్బందిలు చేశారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టు చేస్తున్నారు. మమ్మల్ని ఆపాలని చూస్తే ముమ్మాటికి నియంతలే. అందుకు మీ చర్యలే నిదర్శనం. 23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6000కే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలి అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది