వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణమో ఇంకా క్లారిటీ రాలేదు.. అన్ని పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి
వైఎస్ షర్మిల : వైఎస్సార్ కూతురుగా తెలంగాణలో తాను రాజన్న పాలన తీసుకు రాబోతున్నట్లుగా వైఎస్ షర్మిల ప్రకటించి కొత్త పార్టీని ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ సమయంలో కొందరు ఆమెను జగనన్న వదిలిన బాణం అంటూ కామెంట్ చేస్తే మరి కొందరు షర్మిలా అని మరి కొందరు అమిత్ షా అంటూ రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. వైఎస్ షర్మిల రాజకీయ అరంగేట్రం అనేది ఖచ్చితంగా టీఆర్‌ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశం అన్నట్లుగా రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న ఈ సమయంలో మళ్లీ కాంగ్రెస్ సందడి మొదలు కాకుండా ఉండాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాల్సి ఉంది. అలా జరగాలంటే షర్మిల పార్టీ పెట్టాల్సిందే అనేది రాజకీయ విశ్లేషకుల వాదన. అందుకే షర్మిల ను కేసీఆర్ రంగంలోకి దించాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ వదిలిన బాణం అంటూ షర్మిలను కొందరు కామెంట్ చేసినా ఆమె ఆ విషయమై స్పష్టత ఇవ్వలేదు. కాని ఆమె ఖచ్చితంగా తాను తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అధికారం నుండి తప్పించి రాజన్న రాజ్యం తీసుకు వస్తానంటూ చెబుతున్నారు. రైతుల నుండి మొదలుకుని విద్యార్థుల వరకు ఏ ఒక్కరు కూడా కేసీఆర్ పాలనపై సంతృప్తిగా లేరు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా పార్టీని పెట్టడం జరుగుతుందని అంటున్నారు. కనుక షర్మిల పార్టీ వెనుక కేసీఆర్ హస్తం ఉండి ఉండదు అనేది ఆ పార్టీ నాయకుల బలమైన నమ్మకం. ఇది ఎంత వరకు నిజం అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. పెద్ద ఎత్తున షర్మిల పార్టీ ఉంటుందని దానిలో టీఆర్‌ఎస్ నుండి చేరికలు ఉంటాయని అంటున్నారు.
వైఎస్ షర్మిల టీఆర్‌ఎస్ వదిలిన బాణమా..?
వైఎస్ షర్మిల టీఆర్‌ఎస్ వదిలిన బాణం అంటూ వస్తున్న వార్తలు పుకార్లు పెద్ద రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. కాని పరిస్థితులు మరియు షర్మిల వర్గం వారు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే టీఆర్‌ఎస్ వారికి భవిష్యత్తులో కొత్త పార్టీ వల్ల ఇబ్బందులు తప్పవేమో అనిపిస్తుంది. షర్మిల రాజకీయంపై మరి కొందరు బీజేపీ వదిలిన బాణం అంటున్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఊపిరి పోసుకుంటున్న బీజేపీకి ఖచ్చితంగా వైఎస్ షర్మిల వల్ల నష్టం తప్ప లాభం లేదు. అందుకే ఆమె బీజేపీ వదిలిన బాణం అయ్యి ఉండదు అనేది కొందరి విశ్లేషణ. ఇక కాంగ్రెస్ వారికి వారి పార్టీని వారే నాశనం చేసుకోవాలనే ఆలోచన అస్సలు ఉండదు. కనుక అలాంటిది ఏమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కనుక షర్మిల ఎవరు విసిరిన బాణం అనేది ఇంకా ఒక క్లారిటీకి రావాల్సి ఉంది.