Ys Sharmila : జగన్ గాయంపై ఆయన చెల్లి షర్మిళ అలా స్పందించడమేంటి..!
ప్రధానాంశాలు:
Ys Sharmila : జగన్ గాయంపై ఆయన చెల్లి షర్మిళ అలా స్పందించడమేంటి..!
Ys Sharmila : విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా అందరు ఉలిక్కిపడేలా చేసింది. చీకటి పడ్డాక వివేకానంద స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై రాయి విసరడంతో జగన్ గాయపడ్డారు. ఎడమకంటి పైభాగం, నుదుటిపై గాయమైంది.అయితే అక్కడికక్కడ ప్రథమ చికిత్స తీసుకున్న ఆయన బస్సు యాత్రను యధాతథంగా కొనసాగించారు. రాత్రి విరామం అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో జగన్ భార్య వైఎస్ భారతి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు ఉన్నారు. అయితే జగన్‌కి తగిలిన గాయానికి మూడు కుట్లు వేసినట్లు సమాచారం.
Ys Sharmila : జగన్ గాయంపై సోదరి స్పందన
కొంత విశ్రాంతి అనంతరం జగన్ కేసరపల్లిలో ఏర్పాటు చేసిన తన బస్సు యాత్ర నైట్ క్యాంప్ కు వెళ్లారు. ఇక గాయం వలన కొంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో జగన్ నేటి బస్సు యాత్రకు విరామం ఇచ్చినట్లు తెలస్తోంది.ఇక ఘటనపై ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సీఎం జగన్ పై దాడిని ప్రధాని మోదీ, చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ కోరుకున్నారు. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికమైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ చంద్రబాబు నాయుడు కోరారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇక తన అన్న జగన్‌పై జరిగిన దాడిని ఆయన సోదరి షర్మిళ ఖండించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగి ఎడమ కంటిపై గాయం కావడం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని నేను భావిస్తున్నాను. కావాలని ఎవరైన చేసి ఉంటే మాత్రం కచ్చితంగా దీనిపై ఫైట్ చేయాలని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని , హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే అని వైఎస్ షర్మిల కోరారు. జగన్ త్వరగా కోలువకోవాలని ఆమె ప్రార్ధించారు. కాగా, గత కొద్ది రోజులు వైఎస్ షర్మిళ.. సీఎం జగన్‌పై విమర్శల వర్షం గుప్పిస్తున్న విషయం తెలిసిందే.