ys jagan : జగన్ పాలిట అతిపెద్ద శత్రువు ఈయనే ? మోడి జగన్ వైపు చూడకుండా ప్లానింగ్ ?
ys jagan ఏపీలో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ పతాక స్థాయిలో చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆంద్రుల హక్కు.. సామాజిక హక్కు.. సెంటిమెంట్ అయిన విశాక ఉక్కు కర్మాగారంను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్దం అవుతుంది. ఈ నిర్ణయంతో మరోసారి ఏపీలో బీజేపీ కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఏపీలో బీజేపీ నడక ప్రారంభిస్తున్న సమయంలో మళ్లీ ఈ నిర్ణయం ఆ పార్టీకి పెద్ద ప్రాణ సంకటం అన్నట్లుగా మారింది. వైకాపా కు కూడా ఈ నిర్ణయం వల్ల చాలా పెద్ద డ్యామేజీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే ఈ నిర్ణయం జరడం వల్ల ముందు ముందు ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఈ విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చి విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో సుజనా చౌదరి శకుని పాత్ర పోషిస్తున్నట్లుగా అనుమానాలు వస్తున్నాయి.
సుజనా వ్యాఖ్యలతో బీజేపీకి చేటు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విశాక స్టీల్ ప్లాంట్ ప్రవేట్ కు నిర్ణయం తీసుకుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం దాన్ని సమర్థిస్తున్నట్లుగా కాకుండా తాము కేంద్రంతో పోరాటం చేస్తాం. అలా అయితే రాజీనామాలు చేస్తాం అంటూ ఆ నిర్ణయాన్ని ఆపేస్తాం అంటూ కొంత కాలం వరకు ప్రకటనలు చేయాలి. అప్పుడు కాని కొంతలో కొంత అయినా రాష్ట్ర బీజేపీ నాయకులపై నమ్మకం కలుగుతుంది. అలా కాదని కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే. ఎవరు ఏం చేసుకున్నా చేసినా కూడా ఆ నిర్ణయం ఆగదు అంటే రాష్ట్ర ప్రజలు బీజేపీపై యుద్దంకు దిగినా ఆశ్చర్యం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అదే పని చేస్తున్నాడు. మేము కేంద్రంతో మాట్లాడి నిర్ణయం వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం అంటు ఉంటే సుజనా చౌదరి మాత్రం అది సాధ్యం కాదు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అవ్వాల్సిందే అంటున్నాడు.
జగన్, మోడీ మద్య సుజనా చిచ్చు..
మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన విశాఖ ఉక్కు ప్రైవేట్ నిర్ణయంను ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. కేంద్రం వద్దకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ బృందం వెళ్లిందని సమాచారం అందుతోంది. సీఎం వైఎస్ జగన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి విశాఖ ఉక్కు విషయమై లేఖ రాయడం జరిగింది. అయితే సుజనా చౌదరి మాత్రం అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అంటూ కేంద్రంకు మద్దతు తెలుపుతున్నాడు. దాంతో మోడీ తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం లేదు. తద్వార బీజేపీ మరియు వైకాపాల మద్య వైరం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. బీజేపీలో ఉండి సొంత పార్టీకి మరియు వైకాపాకు దూరం పెంచేలా చూడటంతో పాటు తెలుగు దేశం పార్టీకి సుజనా చౌదరి మంచి చేసేలా ప్లాన్ చేస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.