YSR Jayanthi : : వైసీపీని ఇరకాటంలో పడేస్తున్న వైఎస్సార్ ఆత్మ కెవిపి మాటలు..!
YSR Jayanthi : ఒక్క ఓటమి వైసీపీ పార్టీనే ప్రమాదంలో నెట్టేసే పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. 2014 లో ఓడినా కూడా పార్టీ వెంటే ఉండి నెక్స్ట్ టర్మ్ మళ్లీ అధికారం చేపట్టేలా చేసుకున్న పార్టీ నేతలు ఇప్పుడు తమ అసంతృప్తి భావజాలంతో పార్టీనే వీడాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. వైసీపీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారని ఇప్పటికే వార్తలు వస్తుండగా ఇప్పుడు దాన్ని కన్ ఫర్మ్ చేస్తూ కాంగ్రెస్ నేత […]
ప్రధానాంశాలు:
YSR Jayanthi : : వైసీపీని ఇరకాటంలో పడేస్తున్న వైఎస్సార్ ఆత్మ కెవిపి మాటలు..!
YSR Jayanthi : ఒక్క ఓటమి వైసీపీ పార్టీనే ప్రమాదంలో నెట్టేసే పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. 2014 లో ఓడినా కూడా పార్టీ వెంటే ఉండి నెక్స్ట్ టర్మ్ మళ్లీ అధికారం చేపట్టేలా చేసుకున్న పార్టీ నేతలు ఇప్పుడు తమ అసంతృప్తి భావజాలంతో పార్టీనే వీడాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. వైసీపీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారని ఇప్పటికే వార్తలు వస్తుండగా ఇప్పుడు దాన్ని కన్ ఫర్మ్ చేస్తూ కాంగ్రెస్ నేత కెవిపి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.వైఎస్సార్ ఆత్మగా పేరు తెచ్చుకున్న కెవిపి రామచంద్రరావు వైసీపీ నుంచి సీనియర్లు అంతా కూడా కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలే వైసీపీలోకి వెళ్లారు. ఐతే ఇప్పుడు మళ్లీ వారు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అన్నట్టుగా కెవిపి మాటలు బలం చేకూరుస్తున్నాయి.
YSR Jayanthi గ్రాఫ్ పెంచుకుంటున్న కాంగ్రెస్
వైసీపీ ఓటమితో ఆ పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ లోకి చేరాలని అనుకుంటున్నారని గత కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చే. 2014లో పార్టీ ఓడినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఇప్పుడు ఎందుకు పార్టీ వీడాలని అనుకుంటున్నారో అర్ధం కావట్లేదు. కెవిపి రామచంద్రరావు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వైసీపీ మొత్తం ఖాళీ అయ్యి కాంగ్రెస్ లోకి చేరేలా పరిస్థితి కబడుతుంది. కాంగ్రెస్ లో షర్మిల అధ్యక్షురాలిగా ఉంది. అయితే సీనియర్లు అంతా కాంగ్రెస్ లోకి వెళ్తే ఆమె పదవికి గండి పడే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఐతే ముందు ఏపీలో కాంగ్రెస్ బలం పెంచుకునే ప్రయత్నంలో వైసీపీ నేతలను పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరేలా ప్రయత్నిస్తున్నారట. వైసీపీ పెద్ద తలకాయలు అన్నీ కూడా పార్టీని వీడి కాంగ్రెస్ కండుగా వేసుకుంటారని అర్ధమవుతుంది.
అలా జరిగితే మాత్రం వైసీపీకి భారీ నష్టమని చెప్పొచ్చు. కేంద్రంలో కూడా ఈసారి ఇండియా కూటమి టఫ్ ఫైట్ ఇచ్చింది. 2029 లో కాంగ్రెస్ కేంద్రంలో కూడా చక్రం తిప్పే అవకాశం ఉంటుంది కాబట్టి వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరడమే శ్రేయస్కరం అనుకుంటున్నారు నేతలు.