Ysrcp : ఉత్త‌రాంధ్ర కూడా ఖాళీ కాబోతుందా.. అక్క‌డ వైసీపీ నుండి జంప్ అయ్యే తొలి వికెట్ ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : ఉత్త‌రాంధ్ర కూడా ఖాళీ కాబోతుందా.. అక్క‌డ వైసీపీ నుండి జంప్ అయ్యే తొలి వికెట్ ఇదే..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 September 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : ఉత్త‌రాంధ్ర కూడా ఖాళీ కాబోతుందా.. అక్క‌డ వైసీపీ నుండి జంప్ అయ్యే తొలి వికెట్ ఇదే..!

Ysrcp : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాజ‌కీయ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో ఉన్న నేత‌లు మెల్లమెల్ల‌గా టీడీపీలోకి జారుకుంటున్నారు.అయితే ఇప్పుడు ఉత్త‌రాంధ్ర నుండి కూడా కొంద‌రు జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు టాక్. అయితే ఉత్త‌రాంధ్ర నుండి తొలి వికెట్‌గా ధ‌ర్మాన పేరు వినిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం పార్టీలో చేరాలని చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. రాజ్యసభ సీటు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. తనకు ఆ సీటు ఇచ్చి తన కుమారుడు రాం మనోహర్ నాయుడుకు రాజకీయ భవిష్యత్తు మీద తగిన హామీని ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి.

Ysrcp టీడీపీ ఆహ్వానిస్తుందా?

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన కుటుంబంగా ఉన్న మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణని సైడ్ చేసి శంకర్ అనే యువ సర్పంచ్ కి ఈసారి టికెట్ ఇస్తే ఆయన గెలిచి వచ్చారు. అయితే రాజకీయ నేపథ్యం బలంగా ఉన్న ధర్మాన ఫ్యామిలీ టీడీపీలోకి జంప్ అయితే ఆయన కుమారుడు రాం మనోహర్ నాయుడుకు వచ్చే ఎన్నికల్లో అయినా అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు అని అంటున్నారు.కొడుకు రాజకీయ భ‌విష్య‌త్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న ధ‌ర్మాన కొన్నాళ్లుగా వైసీపీకి దూరంగా ఉంటూ టీడీపీలోకి జంప్ అయ్యే ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది.వైసీపీలో ఉంటే కనుక అయిదేళ్ల పాటు పార్టీలో ఏ అవకాశాలు రావు.

Ysrcp ఉత్త‌రాంధ్ర కూడా ఖాళీ కాబోతుందా అక్క‌డ వైసీపీ నుండి జంప్ అయ్యే తొలి వికెట్ ఇదే

Ysrcp : ఉత్త‌రాంధ్ర కూడా ఖాళీ కాబోతుందా.. అక్క‌డ వైసీపీ నుండి జంప్ అయ్యే తొలి వికెట్ ఇదే..!

అందుకే ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. ధర్మాన వైసీపీలో ఉన్నపుడు చంద్రబాబు మీద కానీ పవన్ మీద కానీ పెద్దగా విమర్శించినది లేదు. అలా ముందు చూపుతోనే ఆయన జాగ్రత్త పడ్డార‌ని టాక్ న‌డుస్తుంది. టీడీపీకి కూడా పెద్ద‌గా అభ్యంత‌రాలు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే బలంగా ఉన్న టీడీపీ కి ధర్మాన చేరిక వల్ల మరింత బలం పెరుతుందని టీడీపీ అధినాయకత్వం భావిస్తే మాత్రం ఆయ‌న‌ని పార్టీలోకి ఆహ్వానం అందించిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక కాలంపాటు మంత్రిగా పని చేసిన నాయకుడిగా ధర్మాన ప్రసాద రావు గుర్తింపు పొందారు. తొలుత నరసన్నపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గానికి మారారు. ఆరుగురు సీఎంల దగ్గర ఆయన మంత్రిగా పని చేశారు.ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుల్లో ధర్మన ప్రసాదరావు ఒకరు. ప్రజా సమస్యలను క్షుణ్నంగా వివరించడం.. ఎలాంటి విషయాన్నైనా సామాన్యులకు సైతం తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పగలగడం, లోతైన విషయ పరిజ్ఞానం ఆయన బలాలు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది